Independence India Diamond Festival: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. వేడుకలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ 15రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరగనున్నాయి

Independence India Diamond Festival: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. వేడుకలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Independence India Diamond Festival

Independence India Diamond Festival: 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ 15రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరగనున్నాయి. సోమవారం హెచ్ఐసీసీలో నిర్వహించే ప్రారంభ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ఉదయం 11.35 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పిస్తారు. మధ్యాహ్నం 1గంటల సమయంలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని సీఎం కేసీఆర్ ఇస్తారు.

Independence Day Sale: అద్భుతమైన ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా ఇండిపెండెన్స్ డే సేల్

వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 75మంది వైణిక విద్వాంసులతో దేశభక్తి గీతాలాపన చేయనున్నారు. స్వతంత్ర సమరయోధులను తలచుకొనే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ప్యూజన్ డ్యాన్స్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ వజ్రోత్సవాల ప్రారంభ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గోనున్నారు. ఇప్పటికే ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక పాసులను జారీ చేశారు. సోమవారం హెచ్ఐసీసీలో ప్రారంభం కానున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమాలతో ముగుస్తాయి. ఇదిలాఉంటే నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Independence Day Sale: అద్భుతమైన ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా ఇండిపెండెన్స్ డే సేల్

హెచ్ఐసీసీలో నేటి వజ్రోత్సవ కార్యక్రమాల వివరాలు :

– ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్‌చే జాతీయ పతాకావిష్కరణ.
– గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పుష్పమాల అలంకరణ.
– 75 మంది వీణ కళాకారులచే వీణా వాద్య ప్రదర్శన
– సాండ్‌ ఆర్ట్‌ ప్రదర్శన
– దేశభక్తి ప్రబోధ నృత్యరూపకం
– ప్యూజన్‌ ప్రదర్శన
– లేజర్‌ షో
– సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రసంగం
– వజ్రోత్సవాల కమిటీ చైర్మన్‌ కేశవరావు ప్రారంభోపన్యాసం
– సీఎం కేసీఆర్‌ ప్రసంగం
– వందన సమర్పణ