Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌.. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్

కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు ప్రెస్‌మీట్‌ పెట్టి... మంత్రి హరీశ్‌రావుతో వీహెచ్‌ భేటీ తర్వాతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారంటూ కామెంట్స్‌ చేశారు.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌.. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్

Tcongress

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి కాకరేగింది. సీనియర్లు వర్సెస్ జూనియర్లు మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోంది. హోటల్ అశోకాలో వీహెచ్‌ ఆధ్వర్యంలో సీనియర్ల సమావేశం తెలంగాణ కాంగ్రెస్‌లో హీట్ పుట్టించింది. ఈ సమావేశానికి కొద్ది మంది సీనియర్లు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై అధిష్టానం ఆరా తీసింది. వీరి సమావేశంపై గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు ప్రెస్‌మీట్‌ పెట్టి… మంత్రి హరీశ్‌రావుతో వీహెచ్‌ భేటీ తర్వాతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారంటూ కామెంట్స్‌ చేశారు.

అనంతరం అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మరికొంతమంది ఇతర కాంగ్రెస్‌ నేతలు సీనియర్ల వద్దకు వెళ్లారు. సమావేశం అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏకంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. రేవంత్‌కు దమ్ముంటే కాంగ్రెస్ తరుఫున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని ఛాలెంజ్ చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్_లో అసలు ఏం జరుగుతోంది?

కాంగ్రెస్‌లో రేవంత్‌ ఫెయిర్ గేమ్ ఆడటం లేదని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వీహెచ్‌ మంత్రి హరీశ్‌రావును కలిస్తే తప్పేంటి? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. వీహెచ్‌ది వ్యక్తిగత భేటీ అని.. రాజకీయ ఎజెండా కాదన్నారు. జగ్గారెడ్డి కామెంట్స్‌పై స్పందించేందుకు అధికార ప్రతినిధులు నిరాకరించారు. రెండు వర్గాల పరస్పర ఆరోపణలతో కాంగ్రెస్‌ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి పర్సనల్‌ షో చేస్తున్నారని… తాను కూడా వ్యక్తిగత షో చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. వ్యక్తిగత ఇమేజ్‌ కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. షోకాజ్‌ నోటీస్ ఇస్తే సమాధానం చెప్తానన్నారు. తమని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి లేదన్నారు. తనను సస్పెండ్ చేస్తే రోజుకో బండారం బయటపెడతానని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Revanth Reddy: “రేవంత్ ఫెయిర్ గేమ్ ఆడటం లేదు.. సస్పెండ్ చేస్తే సత్తా చూపిస్తా”

మంత్రి హరీశ్ రావును కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రహస్యంగా కలిశారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే సొంత పనులపై మంత్రిని కలిస్తే తప్పేంటని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంత్రి ఎక్కడుంటే అక్కడ కలుస్తారని అందులో తప్పేమీ లేదన్నారు.

కాంగ్రెస్‌లో కోవర్టులను గర్తించామని కాంగ్రెస్ నేత మానవతారాయ్ అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగించాలని చూస్తే అలాంటి వారిని తన్ని తరిమేస్తామని హెచ్చరించారు. తమను కోవర్ట్‌ అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బయటకు వెళ్లాలనుకుంటే బహిరంగంగానే వెళతామని కౌంటర్ ఇచ్చారు.

Kamareddy Congress: కామారెడ్డి కాంగ్రెస్ సభలో “టీఆర్ఎస్” స్టిక్కర్ కలకలం

హైకమాండ్ నిర్ణయాలపై ఎవరికీ అభ్యంతరం ఉండదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలు పార్టీకి ఒక లిట్మస్ టెస్ట్ లాంటివని తెలిపారు. తమది అసమమ్మతి వర్గం కాదని, తాము బాధ్యత కలిగిన పార్టీ విధేయులం అని మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ విధేయులుగా తాము ఎప్పటికీ కలుస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.