Union Bank : బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. 18 గంటల పాటు లాకర్ గదిలో 75 ఏళ్ల వృద్ధుడు

జూబ్లీహిల్స్‌ యూనియన్‌ బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది. లాకర్‌ కోసం వచ్చిన ఓ కస్టమర్‌ను బ్యాంక్‌లోనే ఉంచి లాక్‌ చేశారు...

Union Bank : బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. 18 గంటల పాటు లాకర్ గదిలో 75 ఏళ్ల వృద్ధుడు

Union Bank

Jubilee Hills Union Bank : జూబ్లీహిల్స్‌ యూనియన్‌ బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది. లాకర్‌ కోసం వచ్చిన ఓ కస్టమర్‌ను బ్యాంక్‌లోనే ఉంచి లాక్‌ చేశారు బ్యాంక్‌ సిబ్బంది. దీంతో రాత్రంతా ఆ వృద్ధుడు లాకర్‌ రూమ్‌లోనే ఉండిపోయారు. 2022, మార్చి 28వ తేదీ సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 67లో కృష్ణారెడ్డి నివాసం ఉంటున్నారు.

Read More : Noida : యువతికి అసభ్యకర వీడియో పంపిన ఎంబీఏ విద్యార్ధి అరెస్ట్

సోమవారం సాయంత్రం 4 గంటలకు కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని యూనియన్ బ్యాంకు కు వచ్చాడు. లాకర్ రూంలో పని ఉందంటూ సిబ్బందికి చెప్పారు. లాకర్ గదిలోకి వెళ్లిన అనంతరం సిబ్బంది గమనించకుండా మూసివేశారు. దీంతో ఆయన రాత్రంతా అందులోనే గడపాల్సి వచ్చింది. ఎప్పటికీ కృష్ణారెడ్డి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడకు వెళ్లాడనే దానిపై ఆరా తీశారు.

Read More : TRS-Congress : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ధాన్యం వార్‌.. కవిత ట్వీట్‌కు మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్‌

మంగళవరం ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. బ్యాంకు లాకర్ గదిలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే కృష్ణారెడ్డి అపస్మార స్థితిలో ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు బ్యాంక్‌ సిబ్బంది.