MLC Kavitha : రేపే కవిత ఈడీ విచారణ.. న్యాయ నిపుణలతో భేటీ, ఢిల్లీకి కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

MLC Kavitha : రేపే కవిత ఈడీ విచారణ.. న్యాయ నిపుణలతో భేటీ, ఢిల్లీకి కేటీఆర్

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇవాళ జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపుల్లో భాగంగానే.. లిక్కర్ స్కామ్ ఆరోపణలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులను లీగల్ గానే ఎదుర్కొందామని కేసీఆర్ అన్నారు.

మరోవైపు ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసంలో తెలంగాణ ఏజీ రామచంద్రరావు, న్యాయవాదులు గద్దె మోహన్ రావ్, సోమా భరత్ కుమార్ తో కవిత చర్చిస్తున్నారు.

Also Read..CM KCR: ముందస్తు ఎన్నికలు ఉండవు.. త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ స్కామ్ లో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కింది. కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మరింత వేడి పెంచింది. శనివారం అసలేం జరగనుంది? అనే దానిపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయవర్గాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ఢిల్లీలో కవిత ఉన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు కూడా హస్తిన వెళ్లారు. తాజాగా.. కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తర్వాత హుటాహుటిన కేటీఆర్ ఢిల్లీ బయల్దేరారు. సుదీర్ఘ చర్చ తర్వాత ఢిల్లీ వెళ్లాలని కేటీఆర్‌కు సీఎం సూచించారు.

శనివారం కవిత ఈడీ విచారణ ఉండటంతో కేటీఆర్ హస్తిన టూర్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఆయన వెంట వెళ్తున్నారని తెలుస్తోంది.

Also Read..Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరిపై బిజెపి కన్ను… పట్టు సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీలు… వ్యూహాల్లో నిమగ్నమైన గులాబీ పార్టీ

ఇక, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్రం, కవితకు ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ఎవరికీ భయపడేది లేదని, పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.