G Kishan Reddy : అమెరికా టూర్.. కన్ఫ్యూజన్‌లో కిషన్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై రాని క్లారిటీ

G Kishan Reddy : ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన సిబ్బంది అంటోంది.

G Kishan Reddy : అమెరికా టూర్.. కన్ఫ్యూజన్‌లో కిషన్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై రాని క్లారిటీ

G Kishan Reddy (Photo : Twitter)

Updated On : July 11, 2023 / 8:39 PM IST

G Kishan Reddy – Cabinet Expansion : అమెరికా టూర్ పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. రేపు (జులై 12) తెల్లవారుజామున కిషన్ రెడ్డి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ నెల 13న యూఎన్ఓలో ప్రపంచ టూరిజంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో 15 నిమిషాలు ప్రసంగించాల్సి ఉంది. ఇప్పటికే అమెరికా వెళ్లేందుకు వీసా ప్రాసెస్ తో పాటు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు కిషన్ రెడ్డి.

Also Read: సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి.. బీజేపీ నుంచి పోటీచేసేదెవరు?

అయితే, కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారంతో కిషన్ రెడ్డి టూర్ పై క్లారిటీ రావడం లేదు. ఇప్పటివరకు ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన సిబ్బంది అంటోంది.

కాగా, రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న  నేపథ్యంలో రేపటి క్యాబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు రేపు రాత్రికి ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రేపు లేదా 18 తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.