Khairatabad Ganesh : సరికొత్త రూపంలో ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి ఎత్తు ఎంతో తెలుసా

హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ భారీ గణపతి. Khairatabad Ganesh Tall

Khairatabad Ganesh : సరికొత్త రూపంలో ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి ఎత్తు ఎంతో తెలుసా

Khairatabad Ganesh Tall

Updated On : August 22, 2023 / 6:13 PM IST

Khairatabad Ganesh Tall : గణేశ్ ఉత్సవాలకు ఖైరాతాబాద్ గణనాథుడు సరికొత్త రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. 69వ ఏడాది సందర్భంగా 63 అడుగుల ఎత్తులో శ్రీ దశ మహా విద్యా గణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ నెల చివరి నాటికి భారీ విగ్రహం తయారీ ఫినిషింగ్ పూర్తి కాబోతోంది.

హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ భారీ గణపతి. ప్రతి ఏటాలానే ఈసారి కూడా భారీ గణనాథుడు కొలువుదీరుతున్నాడు. ఈసారి మరింత ప్రత్యేకంగా, విభిన్నంగా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఒకవైపు లక్ష్మీ నరసింహ స్వామి, మరొకవైపు వీరభద్ర స్వామి ఉంటారు.

Also Read..Raksha Bandhan 2023 : భద్ర కాలంలో రాఖీ అస్సలు కట్టొద్దు .. మరి ఈ ఏడాది రాఖీ ఎప్పుడు కట్టాలి? ఆగస్టు 30 నా..? 31నా..?

ఇప్పటివరకు వినాయక విగ్రహం తయారీ పనులు 60శాతం పూర్తయ్యాయి. 18వ తేదీన వినాయక చవితి ఉంటుంది. 15వ తేదీ నాటికి వినాయకుడి విగ్రహం తయారీ పూర్తవుతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రంగులు వేస్తారు. 10 రోజుల పాటు రంగులు వేస్తారు. గతేడాది తొలిసారిగా 58 అడుగుల ఎత్తుతో మట్టి వినాయకుడిని చేశారు. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తుతో మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Also Read..Raksha bandhan 2023 : పురాణాల్లో రక్షా బంధన్ .. ఎవరు ఎవరికి కట్టారో తెలుసా..?