Weather Forecast : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరొక మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ  కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు.

Weather Forecast : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Imd Director Nagaratna

Weather Forecast :  తెలంగాణలో మరొక   మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ  కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు. ఈరోజు రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.  గత 8 ఏళ్లలో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షకాల సీజన్ జూలై రెండవ వారంలో ఎక్కువ వర్షపాతం నమోదైందని ఆమె వివరించారు.

2015లో జులై నెలలో 67శాతం వర్షపాతం నమోదుకాగా… ఈ ఏడాది ఇప్పటికి 127 శాతం వర్షపాతం నమోదు అయిందన్నారు. జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా  196శాతం వర్షపాతం నమోదయింది.  తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

వీటికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడన తీవ్ర అల్పపీడనం ఏర్పడింది..దానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటికి తోడు షియర్  జోన్ కూడా కొనసాగుతోందని ఈ నేపధ్యంలో తెలంగాణలో 11 జిల్లాలకు మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించామని ఆమె తెలిపారు. హైదరాబాదులో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని…రాత్రి సమయాల్లో మోస్తారుతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలకు తోడు గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు.

Also Read : MLA Fishing In Pond : చెరువులో చేపలు పట్టిన ఎమ్మెల్యే