CM KCR : తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం నా అదృష్టం : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో 150 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్... ఏటు చూసినా వరికోతలే అని పేర్కొన్నారు.

CM KCR : తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం నా అదృష్టం : సీఎం కేసీఆర్

CM KCR

Telangana Movement : రాష్ట్రం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ధాల త్యాగాలను.. పదేళ్ల ప్రగతిని చాటుదాం అని అన్నారు. ‘తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం.. నా జీవితానికి దక్కిన అదృష్టం’ అని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేర్చుతూ ప్రభుత్వం మనసావాచా ముందుకెలుతుందని చెప్పారు. దేశానికి తెలంగాణ ప్రగతిని చాటుదామని తెలిపారు.

తెలంగాణ నేడు బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. నాడు విస్మరించిన అన్ని రంగాల్లో నేడు అభివృద్ధి సాధించామని తెలిపారు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా… పరిపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు.

Minister Srinivas Goud : ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో 150 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్… ఏటు చూసినా వరికోతలే అని పేర్కొన్నారు. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ అని కొనియాడారు. దశాబ్ధి ఉత్సవాల వేళ ఈనెల 24న గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు.

పేదల ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద 3లక్షలు.. మూడు దశల్లో అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకం అములు చేస్తున్నామని వెల్లడించారు. దళితుల ఆత్మగౌరవం పెంచేలా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

Caste System: గతంలో కులవివక్ష లేదనడం అబద్ధం, జరిగిన అన్యాయాన్ని అంగీకరించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

తెలంగాణలో 47 వేల చెరువులు పునరుద్ధరించామని తెలిపారు. నాడు తాంబాలల్ల చెరువులు… నేడు గంగళల్ల చెరువులు మారాయని అభిర్ణించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లు దేశాన్నే ఆకట్టుకున్నాయని చెప్పారు. స్వరాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధలు లేవన్నారు. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు ల్లేవని, రైతులకు నీళ్ళు లేవన్న రంది లేదని చెప్పారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే.. పవర్ హాలిడేల్లేవ్ అని పేర్కొన్నారు.

ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ తెలంగాణలో ఇస్తున్నామని తెలిపార. సాగునీటి రంగంలో తెలంగాణ లక్ష్యాలను చేరుతుందన్నారు. కాళేశ్వరం నిర్మాణం దేశ చరిత్రలో అపురూప ఘట్టమని పేర్కొన్నారు. కాళేశ్వరంతో 20 లక్షల ఏకరాల కొత్త ఆయకట్టు వచ్చిందన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుత పరివర్తన సాధించిందని తెలిపారు.

Mayawati: కాంగ్రెస్ ‘ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్’ పథకాలపై విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్ మాయావతి

రైతు బంధు…వ్యవసాయ దిశను, రైతు దశను మార్చిందని వెల్లడించారు. రైతు బంధు దేశ వ్యవసాయ రంగంలో సువర్ణ అధ్యయాన్ని లిఖించిందన్నారు. కేంద్రం నిరాకరించినా.. రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేస్తూ రైతుకు అండగా నిలిచామని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే తమ పరమావధి అని తెలిపారు. 2022-23 కు రాష్ట్రంలో 2 కోట్ల ఇరవై లక్షల ఏకారాల సాగు పెరిగిందన్నారు.