MLA Sanjay : రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది : ఎమ్మెల్యే సంజయ్

తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.

MLA Sanjay : రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది : ఎమ్మెల్యే సంజయ్

MLA Sanjay

MLA Sanjay Comments Congress : కాంగ్రెస్ పై ఎమ్మెల్యే సంజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను చెల్లించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేలు చెల్లించింది వాస్తవం కాదా అని అన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లల్లో కేసీఆర్ ప్రభుత్వానికి వాటా ఉందని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆదివారం సంజయ్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లల్లో ఓటు అడిగే హక్క తమకే ఉందని తెలిపారు. తాము రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతును ఓటు అడిగే హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ కు లేదన్నారు.

Puvvada Ajay Kumar : కొందరు స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలి చేయాలనుకుంటున్నారు : మంత్రి పువ్వాడ

బీడీ కార్మికులను పెన్షన్ తో అదుకున్నామని, అడబిడ్డలను ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. దళితులకు దళిత బంధు ఇచ్చి అదుకున్నామని, అడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లతో ఆదుకున్నాం.. కాబట్టి మహిళల ఓటు అడిగే హక్కు తమకే ఉందని..కాంగ్రెస్ కు లేదన్నారు.

నేతన్నలని, గొల్ల కురుమ, గౌడ కులాలను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కదా అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులందరూ సోనియా గాంధీ మీద ఓట్టేసి మద్యం మానేయాలని హితవు పలికారు.