Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహకం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మరింతగా పెంచింది.

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహకం..

Telangana Government

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు చర్యలు మరింతగా పెంచింది. ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి రూ.3వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు ఈ విధానం దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Minister Harish Rao: ప్రతీ ఆదివారం 10 నిమిషాలు ఇలా చేయండి.. ప్రజలకు మంత్రి హరీష్‌రావు సూచన

నార్మల్ డెలివరీ వల్ల తల్లికి, శిశువుకు మేలు చేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవం వల్ల మొదటి గంటలో తల్లి పాలు అందడటంతో పాటు శిశువుకు ఆరు నెలల పాలు అందుతాయని, తద్వారా శిశు మరణాల రేటు 22శాతం తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 45శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో 55శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రైవేట్లో 80శాతం సిజేరియన్, 20శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.

Minister Harish Rao: బీజేపీలో విషం తప్ప విషయం లేదు.. ఒక్క విషయంపై స్పష్టత ఇవ్వలేదు

హెల్త్ సర్వీసెస్ లో దేశంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఉందని, ఇది కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారమేనని హరీష్ రావు అన్నారు. ప్రతీ నార్మల్ డెలివరీకి రూ. 3వేలు ఇంక్రిమెంట్ ఇస్తున్నామని, వైద్యులు, నర్సులు, ఆశాలు, ఏఎన్ఎంలకు ఈ ప్రోత్సాహకంను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.