China Manja : ప్రాణం తీసిన గాలిపటం మాంజా.. గొంతు తెగి అక్కడికక్కడే మృతి

సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది.

China Manja : ప్రాణం తీసిన గాలిపటం మాంజా.. గొంతు తెగి అక్కడికక్కడే మృతి

Kite China Manja

China Manja : సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గాలిపటం మాంజా వల్ల గొంతు తెగి మృతి చెందాడు.

మంచిర్యాలతో దంపతులు బైక్ పై వెళ్తుండగా.. గాలిపటం మాంజా వాహనం నడుపుతున్న భర్త మెడకు చుట్టుకుంది. బైక్ వేగంగా వెళ్తుండ‌టంతో.. ఆ మాంజా మెడకు బిగుసుకుపోయి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు క్షణాల్లోనే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో భార్య షాక్ కి గురైంది. కళ్లెదుటే భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. మంచిర్యాల జాతీయ రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

స‌ర‌దాగా సాగాల్సిన ప‌తంగుల పండుగ.. ప్రాణాలు తీసుకుంటోంది. ప్రమాదకరమైన చైనా మాంజాను వినియోగించొద్ద‌ని ప్రభుత్వాలు ఎంత చెప్పినా జ‌నాలు మాత్రం వినిపించుకోవ‌ట్లేదు. చైనా మాంజాపై నిషేధం విధించినా వాటినే కొనుగోలు చేస్తున్నారు. ప్రాణాల‌ను తీసే చైనా మాంజానే నిర్ల‌క్ష్యంగా ఉప‌యోగించి.. ప‌లువురి మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు. కాగా, గతంలోనూ చైనా మాంజా కారణంగా పలువురి ప్రాణాలు పోయాయి. అయినా మార్పు రావడం లేదు.

చైనా మాంజా విక్రయాలపై మన దేశంలో నిషేధం ఉంది. అయినప్పటికి కొందరు వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. చైనా మాంజా పక్షులకు హాని కలిగిస్తుందని బ్యాన్ విధించారు.

వీటితో ప్రమాదమే:
నైలాన్‌, చైనీస్‌, గ్లాస్‌ కోటెడ్‌ ఉన్న కాటన్‌ మాంజాలపై నిషేధం ఉంది. ఎందుకంటే.. వీటి కారణంగా పక్షులు, జంతువులకే కాదు మనుషులకూ ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. పతంగులు ఎగురవేసేందుకు మాంజాను కాకుండా సాధారణ దారాన్నే వినియోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

Butter Milk : అజీర్ణ సమస్యలకు చక్కని ఔషదం… మజ్జిగ

పక్షుల పాలిట యమపాశం:
చైనా మాంజా పక్షుల పాలిట యమపాశంలా మారింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) నిబంధనల మేరకు పతంగుల యాజమాన్యాలు సాధారణ దారాలనే విక్రయించాలి. గాలిపటాలు ఎగురవేసినప్పుడు అత్యధికంగా భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలకు చుట్టుకుంటాయి. అందువల్ల పక్షులతోపాటు మనుషులూ ఇబ్బందులకు గురవుతున్నారు.

చైనా మాంజా వల్ల అనేక పక్షులు ప్రమాదాలకు గురవుతున్నాయి. పావురాలు, కాకులు, గద్దలు.. ఎన్నో పక్షులకు ఉరితాళ్లుగా మారాయి. పతంగులను సాధారణ ధారాలతోనే ఎగురవేస్తే జీవవైవిధ్యాన్ని కాపాడిన వారమవుతామని అధికారులు సూచించారు.

మాంజా అమ్మినా, కొన్నా ఐదేళ్ల జైలుశిక్ష:
ఏటేటా చైనా మాంజా కారణంగా ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో మాంజా కారణంగా ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ సంఘటన తర్వాత స్థానికులు మాంజా వాడకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. దాంతో ఢిల్లీ ప్రభుత్వం మాంజాను నిషేధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) కూడా గతంలోనే.. గాజు పూతపూసిన నైలాన్‌ లేదా సింథటిక్‌ చైనా మాంజాను అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మాంజా అమ్మిన వారికి, కొన్న వారికి ఒకటి నుంచి ఐదేళ్ల జైలుశిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా, లేదంటే రెండూ విధించేలా చట్టం చేసింది.