KRMB : పానీ పే చర్చ, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్

బుధవారం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా రివర్ బోర్డ్ సమావేశం హాట్ హాట్‍‌గా సాగే అవకాశం ఉంది.

KRMB : పానీ పే చర్చ, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్

Krmb

Krishna River Management Board : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఓ రేంజ్‌లో యుద్ధం నడుస్తోంది. నీటి వాటాలు, విద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల నిర్మాణం.. నీటి వినియోగం.. ఇలా అన్ని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. బుధవారం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వాదనలను గట్టిగా వినిపించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్… అధికారులకు మార్గదర్శనం చేశారు.

Read More : Nizamabad : రెండు త‌ల‌ల‌తో పుట్టిన గొర్రె పిల్ల‌

కృష్ణా బోర్డు సమావేశంలో… నీటి కేటాయింపులపై పట్టుబట్టాలని తెలంగాణ నిర్ణయించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ అత్యధికంగా ఉందని.. నీటి కేటాయింపులు తక్కువగా ఉన్నాయనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లనుంది. పరివాహక ప్రాంతం 66 శాతం ఉంటే.. నీటి కేటాయింపులు మాత్రం 32 శాతమే ఉన్నాయి. ఈ నిష్పత్తిని సరిచేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. 811 టీఎంసీలుండగా.. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా కేటాయింపులు జరిగాయి. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి.

Read More : Gram Panchayats : గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

అయితే.. రెండు రాష్ట్రాలకు చెరి సగం అంటే 405 టీఎంసీలు కేటాయించేలా ఒత్తిడి తేవాలని తెలంగాణ భావిస్తోంది. మరోవైపు.. కృష్ణా నీటిని ఇతర బేసిన్లలోకి తరలిస్తూ.. ఏపీ నీటి దోపిడికి పాల్పడుతోందన్నది తెలంగాణ ఆరోపణ. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వెలిగొండ, హంద్రీనీవా, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ద్వారా.. పెన్ననా బేసిన్‌లోకి తరలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఏఐబీపీలో చేర్చడాన్ని తప్పుబట్టింది.

Read More : Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు

ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీటిని తరలించడం చట్ట విరుద్ధమంటున్న తెలంగాణ.. సమావేశంలో అభ్యంతరాలను గట్టిగా వినిపించాలని డిసైడ్ అయింది. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే.. అసలు ప్రాజెక్ట్ నిర్మించిందే జలవిద్యుత్ కోసం కాబట్టి.. కచ్చితంగా ఉత్పత్తి చేస్తామని తెలంగాణ చెబుతోంది. ఈ విషయంతో పాటు.. నీటి వినియోగం విషయంలో చట్టబద్ధంగానే ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని లెక్కలతో సహా చెప్పాలని నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగే కృష్ణా రివర్ బోర్డ్ సమావేశం హాట్ హాట్‍‌గా సాగే అవకాశం ఉంది.