Gram Panchayats : గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేశంలోని 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు కేటాయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Gram Panchayats : గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

Union Govt

Central Government released funds : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేశంలోని 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు కేటాయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25,129.98 కోట్లు విడుదల చేసింది.

తాజాగా కేటాయింపుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.2,162.4కోట్లు, మహారాష్ట్రకు రూ.1,292.1కోట్లు, బీహార్‌కు రూ.1,112.7కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.883.2కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.581 కోట్లు, తెలంగాణకు రూ.409 కోట్ల గ్రాంట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏపీకి రూ.969.50కోట్లు, తెలంగాణకు రూ.628.5కోట్లు ఇచ్చింది.

పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపు నీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు 10 రోజుల్లో నిధులను స్థానిక పంచాయతీలకు చేర్చాలని ఆదేశించింది. 10 రోజులు దాటితే వడ్డీతో సహా బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఇదిలావుంటే ఈ నిధుల్లో 60 శాతం పారిశుధ్యం, ఓడీఎఫ్‌, తాగునీటి సరఫరాకు.. మరో 40 శాతం నిధులు జీతాల చెల్లింపుతో పాటు పంచాయతీలు అభీష్టం మేరకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.