Ramappa Temple : రామప్ప దగ్గర భూముల ధరలకు రెక్కలు

రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. గత వారం రూ.25 లక్షలు పలికిన ఎకరం భూమి.. ఇప్పుడు రూ.60 లక్షలు అయినా ఇచ్చేలా లేరు అక్కడి రైతులు. దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో భారీగా ధరలు పెరిగాయి

Ramappa Temple : రామప్ప దగ్గర భూముల ధరలకు రెక్కలు

Ramappa Temple

Ramappa Temple : షేర్ల ధరలు నిమిషాల్లో పెరగడం చూసాం.. కానీ భూముల ధరలు నిమిషాల్లో లక్షలకు లక్షలు పెరగడం తొలిసారి చూస్తున్నాం.. అది కూడా మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే. గత వారం ఎకరం 25 లక్షల రూపాయలు ఉన్న భూమి.. వారం తిరక్కముందే ఏకంగా రూ.60 లక్షలకు చేరింది.

అవును నిజమే.. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం క్రితం దేవాలయ పరిసర ప్రాంతాల్లోకి గ్రామాల్లో ఎకరం రూ.25 లక్షలు ఉండేది. రామప్ప చెరువు ఉండటంతో ఇక్కడ ఏడాదికి రెండు పంటలు పండుతాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు కొంచం ఎక్కువే అయితే.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో వేగంగా ధరలు పెరిగాయి.

చుట్టుపక్కల గ్రామాల్లో రియల్టర్లు వాలిపోయారు. హైదరాబాద్, వరంగల్ తోపాటు స్థానికంగా ఉన్న నేతలు దేవాలయం చుట్టుపక్కల భూములు కొనేందుకు పరుగులు పెడుతున్నారు. పాలంపేట గ్రామంతోపాటు దాని చుట్టుపక్కల రైతులు ఫోన్లతో బిజీ అయిపోయారు. రియల్టర్లు ఒకరితర్వాత ఒకరు రైతులకు ఫోన్ చేసి భూములు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. మరికొందరు వెంచర్ చేసి అమ్మిపెడతామని రైతులకు ఫోన్లు చేసి కోరుతున్నారు.

వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకే ఆ ప్రాంత ప్రజలు రియల్టర్ల ఫోన్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక మరికొందరు దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చి తమ ప్రాంతాల్లో భూముల రేట్లకు రెక్కలు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రామప్ప దానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఎకరం రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు పలుకుతుందట. ఇక ఇప్పటికే కొద్దీ మంది రైతులు తమ భూములకు అమ్ముకోగా చాలామంది అమ్మెందుకు ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో రియల్టర్లు రైతులను బ్రతిమాలే పనిలో పడ్డారు.

రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి.