Cyber Crime: మహేష్ బ్యాంక్ చెస్ట్ అకౌంట్‌లో రూ. 12కోట్ల డబ్బు మాయం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేష్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లోని చెస్ట్ అకౌంట్‌లో నగదు నిల్వలు తగ్గడం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు.

Cyber Crime: మహేష్ బ్యాంక్ చెస్ట్ అకౌంట్‌లో రూ. 12కోట్ల డబ్బు మాయం

Mahesh Bank

Cyber Crime: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేష్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లోని చెస్ట్ అకౌంట్‌లో నగదు నిల్వలు తగ్గడం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు. మూడు కరెంట్‌ అకౌంట్లలో నుంచి బ్యాంకు చెస్ట్‌ ఖాతా నుంచి రూ.12.4 కోట్లు తగ్గినట్లుగా గుర్తించిన బ్యాంకు అధికారులు.

ఈ విషయంపై 10టీవీతో మహేష్ బ్యాంక్ IT హెడ్ DGM బద్రీనాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. కస్టమర్ల అకౌంట్ నుంచి ఎలాంటి నగదు పోలేదని చెప్పుకొచ్చారు. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహేష్ బ్యాంక్ కస్టమర్లు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదన్నారు. పోయిన నగదుకు ఇన్సూరెన్స్ ఉందని వెల్లడించారు.

ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు విచారణ జరుపుతున్నారని చెప్పారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సైబర్ హ్యక్ జరిగే ముందుగానే గమనించామని, వెంటనే అలర్ట్ అయ్యి చాలావరకు అమౌంట్ సేఫ్ చేయగలిగామని అన్నారు. హ్యాక్ ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు బద్రీనాథ్.

శని, ఆదివారాల్లో బ్యాంకు పని చేయని సమయంలో అదునుచూసి సైబర్‌ నేరగాళ్లు సూపర్‌ అడ్మిన్‌యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆధారంగా లాగిన్‌ అయ్యారని, రూ.12.4 కోట్లను మూడు ఖాతాల్లోకి మళ్లించి, ఆ మూడు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును ఉత్తరాదితో పాటు త్రిపుర, అసోం, సిక్కింల్లోని వివిధ బ్యాంకుల్లో 127 ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసినట్లు గుర్తించారు.