Minister KTR: తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో బల్క్‌ డ్రగ్‌ పార్కుల విషయంలో మాండవీయ విభిన్న రకాలుగా మాట్లాడారని చెప్పారు. మాండవీయ అసత్యాలు చెప్పి తెలంగాణ గుండెను గాయపరిచారని ఆయన అన్నారు. దేశ లైఫ్ సైన్సెస్ హబ్‌ కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వలేదని, మన దేశానికి తీరని అన్యాయం చేశారని కేటీఆర్ చెప్పారు.

Minister KTR: తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

Minister Ktr

Minister KTR: తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో బల్క్‌ డ్రగ్‌ పార్కుల విషయంలో మాండవీయ విభిన్న రకాలుగా మాట్లాడారని చెప్పారు. మాండవీయ అసత్యాలు చెప్పి తెలంగాణ గుండెను గాయపరిచారని ఆయన అన్నారు. దేశ లైఫ్ సైన్సెస్ హబ్‌ కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వలేదని, మన దేశానికి తీరని అన్యాయం చేశారని కేటీఆర్ చెప్పారు.

బీజేపీ మన దేశ ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తోందని విమర్శించారు. అసత్యాలు చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్‌ ను తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు. మాండవీయపై లోక్‌భలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అసత్యాలు చెప్పినందుకు మాండవీయ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

కాగా, బల్క్‌ డ్రగ్స్‌ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయంలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఏపీలో ఏర్పాటు చేేస్తామని మాండవీయ చెప్పారు. అయితే, లోక్ సభలో మాట్లాడుతూ మాత్రం తెలంగాణకు కేటాయించినట్లు చెప్పారని విమర్శలు వస్తున్నాయి. బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటు గురించి లోక్‌సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానం చెప్పారు.

దేశంలో 3 బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. వాటిలో ఒక్కో పార్కుపై రూ.1,00 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. తాము ఇప్పటికే రాష్ట్రాల నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. హైదరాబాద్‌ లో దాని ఏర్పాటుకు ఆమోదం తెలిపామని చెప్పారు. అయితే, లోక్ సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మాత్రం ఏపీ, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ల దరఖాస్తులు ఆమోద ముద్ర పొందినట్లు చెప్పారు.

Pathaan: మరో వివాదంలె ‘పఠాన్’ సినిమా.. హిందువులు కాదు, ఈసారి ముస్లింలే బ్యాన్ చేయాలంటున్నారు