New Traffic Rules: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. అతిక్రమిస్తే ఫైన్ల మోతే!

జంట నగరాల్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలుకాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న నిబంధనల్ని మరింత కఠినంగా ట్రాఫిక్ పోలీసులు అమలు చేయబోతున్నారు. సోమవారం నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.

New Traffic Rules: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. అతిక్రమిస్తే ఫైన్ల మోతే!

New Traffic Rules: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇకపై కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు కానున్నాయి. అధికారులు ట్రాఫిక్ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి ఇకపై పోలీసులు భారీ జరిమానాలు విధించబోతున్నారు.

Muslims Revive Durga Puja: కాలనీలో ఒకే హిందూ కుటుంబం.. దుర్గామాత పూజలు నిర్వహిస్తున్న ముస్లింలు

సోమవారం నుంచి ట్రాఫిక్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటి వాహనదారులు ముందుకొస్తే రూ.100 ఫైన్. అలాగే ఫుట్‌పాత్‌లను దుకాణదారులు ఆక్రమించి, వారికి సంబంధించిన ఏవైనా వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తారు. అలాగే పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 జరిమానా ఉంటుంది. వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసి, ఇతర వాహనాలు వెళ్లకుండా చేస్తే రూ.1,000 జరిమానా. తాజా నిబంధనలకు అనుగుణంగా సోమవారం నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతారు.