Muslims Revive Durga Puja: కాలనీలో ఒకే హిందూ కుటుంబం.. దుర్గామాత పూజలు నిర్వహిస్తున్న ముస్లింలు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లింలు అధికంగా ఉండి, హిందూ కుటుంబం ఒకటే ఉన్న కాలనీలో ముస్లింలు దుర్గా మాత పూజలో పాల్గొంటున్నారు. హిందూ కుటుంబంతోపాటు పూజలు నిర్వహిస్తున్నారు.

Muslims Revive Durga Puja: కాలనీలో ఒకే హిందూ కుటుంబం.. దుర్గామాత పూజలు నిర్వహిస్తున్న ముస్లింలు

Muslims Revive Durga Puja: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటనలు అనేకం జరుగుతుంటాయి. హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

స్థానిక అలీముద్దీన్ స్ట్రీట్, షరీఫ్ లేన్‌లో ముస్లింలంతా కలిసి హిందూ పూజ నిర్వహిస్తున్నారు. తమ మత సామరస్యాన్ని చాటి చెబుతున్నారు. అయితే, దీనికో కారణం ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఒక్క హిందూ కుటంబమే ఉంటోంది. చుట్టూ అంతా ముస్లింలే. గతంలో మాత్రం చుట్టుపక్కల చాలా హిందూ కుటుంబాలు ఇక్కడ ఉండేవి. కానీ, వివిధ కారణాల రీత్యా హిందూ కుటుంబాలన్నీ అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. అయితే, హిందూ కుటుంబాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇక్కడ దసరా సందర్భంగా దుర్గామాతను ప్రతిష్టించి కొలిచేవారు. కానీ, వాళ్లంతా వెళ్లిపోవడం వల్ల, ఒక్క కుటుంబమే ఉండటం వల్ల 16 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాత పూజ జరగడం లేదు.

Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్

ఈ నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న సయంత సేన్ అనే హిందూ కుటుంబం స్థానిక ముస్లింలను కలిసింది. దుర్గామాత పూజ నిర్వహించేందుకు సహకరించమని గత ఏడాది కోరింది. అప్పట్లో స్థానిక ముస్లిం క్లబ్‌కు చెందిన కొందరు యువకులు సమావేశమై గతంలోలాగే ఘనంగా దుర్గామాత పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. చాలా ఏళ్ల క్రితం అంతరించిన సంప్రదాయాన్ని తిరిగి కొనసాగించాలి అనుకున్నారు. అనుకున్నట్లుగానే దుర్గా మాత పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో సయంత సేన్ కుటుంబంతోపాటు పలువురు ముస్లింలు కూడా పాల్గొంటున్నారు.