Apex council: హెచ్‌సీఏలో ట్విస్ట్.. అజార్‌కు ఊరట.. అపెక్స్ కౌన్సిల్ రద్దు..

Apex council: హెచ్‌సీఏలో ట్విస్ట్.. అజార్‌కు ఊరట.. అపెక్స్ కౌన్సిల్ రద్దు..

Apex

HCA’s Apex council: హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో ఆదివారం(04 జులై 2021) కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ చైర్మ‌న్‌గా ఎన్నికైన భారతజట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించిన అపెక్స్ కౌన్సిల్‌ను ర‌ద్దుచేస్తూ అంబుడ్స్‌మెన్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అంబుడ్స్ మెన్ జ‌స్టిస్ దీప‌క్ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు ప్రకటించారు.

అపెక్స్ కౌన్సిల్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ అజార్ అంబుడ్స్ మెన్‌ను ఆశ్ర‌యించగా.. మాజీ ఎంపీ వివేక్ ప‌ద‌వీకాలం ముగిసిన సంద‌ర్భంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఆ ప‌ద‌వి కోసం నామినేష‌న్ వేసిన అజారుద్దీన్.. వివేక్ ప్యానెల్‌ను ఓడించి చైర్మ‌న్ ప‌ద‌విని దక్కించుకున్నారు. ఆ త‌ర్వాత కొంత‌కాలం పాటు హెచ్‌సీఏ వ్య‌వ‌హారాలు సాఫీగానే సాగినప్పటికీ, లేటెస్ట్‌గా అజారుద్ధీన్ ఎన్నిక చెల్ల‌దంటూ అపెక్స్ కౌన్సిల్ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ జాన్ మ‌నోహ‌ర్ అనే వ్యక్తిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియ‌మిస్తూ ప్రకటన చేసింది.

అపెక్స్ కౌన్సిల్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ అజారుద్దీన్ అంబుడ్స్‌మెన్‌లో పిర్యాదు చేయగా.. విచార‌ణ చేప‌ట్టిన అంబుడ్స్‌మెన్ త‌న తీర్పును ఆదివారం వెల్ల‌డించింది. అజార్‌ను పదవి నుంచి తొలిగిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదని అపెక్స్ కౌన్సిల్‌నే ర‌ద్దు చేసేసింది. అయితే అపెక్స్ కౌన్సిల్‌ను ర‌ద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ తీసుకున్న నిర్ణ‌యం చెల్ల‌ద‌ని అజారుద్దీన్ వ్య‌తిరేక వ‌ర్గం వాదిస్తోంది.