Munugode By Election: హీట్ పెంచుతున్న మునుగోడు బైపోల్.. ప్రచారపర్వానికి మరో వారంరోజులే గడువు.. గెలుపే లక్ష్యంగా పార్టీల ఎత్తుకు పైఎత్తులు

ప్రచారపర్వానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ చార్జిలు మునుగోడులోనే మకాంవేసి ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోబాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దీపావళి సందర్భంగా ఓటర్లకు మద్యం బాటిళ్ల పంపిణీ చేశారు.

Munugode By Election: హీట్ పెంచుతున్న మునుగోడు బైపోల్.. ప్రచారపర్వానికి మరో వారంరోజులే గడువు.. గెలుపే లక్ష్యంగా పార్టీల ఎత్తుకు పైఎత్తులు

Munugodu bypoll

Munugode By Election: మునుగోడు ఉపఎన్నికల తేదీ దగ్గర పడుతుంది. మరో వారంరోజుల్లో ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థులతో పాటు పార్టీల కీలక నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాంవేసి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పార్టీల నేతలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. ఆయా పార్టీల్లోని కీలక నేతలు దీపావళి పండుగను మునుగోడులోనే నిర్వహించారు. పలు గ్రామాల్లో గ్రామస్తులతో కలిసి దీపావళి వేడుకల్లో సందడి చేశారు.

Munugode By Poll : గెలుపుకోసం టీఆర్ఎస్ ఫీట్లు .. దోశలు,పూరీలు వేసి ఇస్త్రీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

మునుగోడు బైపోల్‌లో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అనట్లు ప్రచారపర్వం సాగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రామాల వారిగా సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమకుకేటాయించిన ఏరియాల్లో ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా పార్టీల కీలక నేతలకు మునుగోడు బై పోల్ అగ్నిక పరీక్ష గా మారిందనే చెప్పొచ్చు.

Munugode Money : కారులో కోటి రూపాయలు.. మునుగోడు ఉపఎన్నిక వేళ నోట్ల కట్టల కలకలం, భారీగా పట్టుబడ నగదు

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటలదాడి తీవ్రమవుతోంది. ప్రచారపర్వంలో ఒకరిపైఒకరు మాటల దాడికి దిగుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నిరసన కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో గెలిచేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నట్లు కనిపిస్తోంది. నికార్సైన కాంగ్రెసోడా మునుగోడు‌కు కదిలిరా అంటూ ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రచారపర్వానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ చార్జిలు మునుగోడులోనే మకాంవేసి ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోబాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దీపావళి సందర్భంగా ఓటర్లకు మద్యం బాటిళ్ల పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా మాంసం పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న నేఫథ్యంలో మునుగోడులో పార్టీల ప్రచారం హోరెత్తనుంది.