Telangana: ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టురట్టు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం.. విఫలం చేసిన పోలీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన భారీ ఆపరేషన్‌ను తెలంగాణ పోలీసులు విఫలం చేశారు. మొయినాబాద్‌లోని ఫాంహౌజ్‌పై దాడి చేసి నలుగురు మధ్యవర్తుల్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Telangana: ‘ఆపరేషన్ ఆకర్ష్’ గుట్టురట్టు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం.. విఫలం చేసిన పోలీసులు

Telangana: తెలంగాణలో భారీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను పోలీసులు విఫలం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు మొయినాబాద్‌లోని ఫాంహౌజ్‌పై దాడి చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

వీరి దగ్గరి నుంచి రూ.15 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ఫాంహౌజ్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి రూ.100 కోట్లతో డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ డీల్ కుదిర్చేందుకు మధ్యవర్తులు ఢిల్లీ నుంచి వచ్చినట్లు సమాచారం.

నందు, రామచంద్ర భారతి, తిరుపతి, సింహయాజులు అనే నలుగురు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.