Munugode By Poll : ఆపరేషన్ మునుగోడు : కమలానికి షాకులు మీద షాకులు.. టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్న బీజేపీ నేతలు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీల నుంచి నేతల జంపింగ్ లు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ మునుగోడు తో కమలానికి షాకులు మీద షాకులు ఇస్తోంది టీఆర్ఎస్. గులాబీ పార్టీలోకి లోకి క్యూ కడుతున్నా బీజేపీ నేతలు. దీంట్లో భాగంగా దాసోజు శ్రవణ్ ..స్వామిగౌడ్ టీఆర్ఎస్ లో చేరారు.

Munugode By Poll : ఆపరేషన్ మునుగోడు : కమలానికి షాకులు మీద షాకులు.. టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్న బీజేపీ నేతలు

Ex-TRS leaders Dasoju Shravan and Swamigowd return from BJP (1)

Munugode By Poll : గతంలో కంటే ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించి బలపండింది. దీంతో టీఆర్ఎస్ మేలుకుంది. తక్షణ చర్యలు ప్రారంభించింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి షాకులు మీద షాకులిస్తోంది. తెలంగాణలోని బీజేపీ నేతల్ని పక్కా వ్యూహంతో అనూహ్యంగా గులాబీ లాగేసి తన గూటిలోకి చేర్చుకుంటోంది. ఆపరేషన్ మునుగోడు పేరుతో బీజేపీ నేతల్ని గులాబీ పార్టీ గాలం వేసి మరీ లాగేస్తోంది. దీనికి ఉదాహరణగా బీజేపీకి గుడ్ బై చెప్పి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్ఎస్ లోకి వచ్చి చేరారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య టీఆర్ఎస్ లో చేరారు. ఇంకా పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటోంది గులాబీ దళం.

మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా పొలిటికల్ జంపింగ్స్ పీక్ కు చేరాయి. మునుగోడు ఉప ఎన్నికు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ప్రత్యర్ది పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ను తమ పార్టీలో చేర్చుకొని బీజేపీ గులాబీ పార్టీకి షాక్ ఇచ్చింది. దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ ఆ పార్టీలోని నేతలను తమ వైపు తిప్పుకోవటం పైన ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా..ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన దాసోజు శ్రావణ్ ఇప్పుడు కమలం పార్టికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి చేరారు.

Telangana : టీఆర్ఎస్‌లో చేరనున్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపిన రాజీనామా లేఖలో పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసారు. ప్రజా హితమైన పథకాలు.. నిబద్దత కలిగిన రాజకీయ సిద్దాంతాలతో ప్రజలను మెప్పించటం కంటే మందు మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచటం ద్వారా మునుగోడు ఎన్నికల్లో గెలుపు సాధించాలనుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు పేర్కొన్నారు. ఈ తీరుకు నిరసనగా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.ఆయన కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు దాసోజు. అలాగే స్వామిగౌడను కూడా పార్టీలో చేరుకుంది గులాబీ పార్టీ.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆ వర్గానికి చెందన ముఖ్య నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న వేళ..పొలిటికల్ జంపింగ్స్ మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ఇస్తున్న వరుస షాక్ లకు బీజేపీ ఏ రకంగా సమాధానం ఇస్తుదనేది ఆసక్తి కరంగా మారుతోంది. స్వామిగౌడ్, దాసోజు పార్టీలోకి మారటంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..రాసోజు శ్రవణ్ సెల్ఫ్ మేడు లీడర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. అలాగే స్వామి గౌడ్ తెలంగాణ ఉద్యంలో వీరోచితంగా పోరాడారు అంటూ పొగిడేశారు. కాగా గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్వామి గౌడ్ మండలి చైర్మన్ గా పనిచేశారు.