PM KISAN: పీఎం కిసాన్ పథకం వర్తించాలంటే అలా చేయాల్సిందే.. మే31 వరకే అవకాశం..

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే 10 విడతులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరాయి. అర్హులైన చిన్న, సన్న కారు రైతులకు విడతకు రూ. 2వేల చొప్పు మూడు విడతల్లో ఏడాదికి రూ.6వేలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింది రైతుల ఖాతాల్లో..

PM KISAN: పీఎం కిసాన్ పథకం వర్తించాలంటే అలా చేయాల్సిందే.. మే31 వరకే అవకాశం..

Pradhan Mantri Kisan Samman Nidhi

PM KISAN: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే 10 విడతులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరాయి. అర్హులైన చిన్న, సన్న కారు రైతులకు విడతకు రూ. 2వేల చొప్పు మూడు విడతల్లో ఏడాదికి రూ.6వేలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింది రైతుల ఖాతాల్లో రూ. 2వేలు జమ కానున్నాయి. అయితే ఈ దఫా రూ.2వేలు రావాలంటే రైతులు e-KYC పూర్తి చేయాలి. ఇందుకు అవకాశం ఈనెల 31వ తేదీ వరకే ఉంది. ఒకవేళ రైతులు e-KYC పూర్తి చేయకుంటే మీ ఖాతాల్లో డబ్బులు పడవు.

PM Kisan Samman Nidhi : రైతులకు నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా త్వరలోనే 11వ విడత కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమచేయనుంది. అయితే ఈ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తామని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. ఈ-కేవైసీ పూర్తిచేయడానికి చివరి తేదీ మే31 వరకు మాత్రమే గడువు ఉంది. ఎవరైనా దీనిని పూర్తిచేయకుంటే భవిష్యత్తులో ఆ రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం పొందలేరు.

PM Kisan : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు..

రైతులు రెండు విధాలుగా పీఎం కిసాన్ ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి.. ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లేదా అప్లికేషన్‌ ద్వారా ఈ పని చేయవచ్చు. ఐతే ఇందుకోసం రైతులు తమ మొబైల్ నెంబర్‌ని ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తవుతుంది.  కామన్ సర్వీస్ సెంటర్‌లో పీఎం కిసాన్ లబ్ధిదారులు బయోమెట్రిక్ పద్ధతిలో ఈ కేవైసీ చేయవచ్చు. వేలిముద్ర పెడితే ఈ కేవైసీ పూర్తవుతుంది. ఇక సాధారణ సేవా కేంద్రంలో కూడా ఈ-కేవేసీ చేయవచ్చు. ఐతే ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ తప్పనిసరిగా ఉండాలి. ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. కామన్ సర్వీస్ సెంటర్‌లో ఈ-కేవైసీ కోసం రూ. 17 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుతో పాటు సీఎస్సీ ఆపరేటర్లు అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తారు. అంటే కామన్ సర్వీస్ సెంటర్‌లో ఈ-కేవైసీకి రూ.37 చెల్లించాలి. అదే మీరే చేసుకుంటే.. ఉచితంగా అయిపోతుంది.