PM Kisan Samman Nidhi : రైతులకు నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించారు. దేశంలోని రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద నిధులు విడుదల చేశారు.

PM Kisan Samman Nidhi
PM Kisan Samman Nidhi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించారు. దేశంలోని రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద నిధులు విడుదల చేశారు. పదో విడతగా విడుదలైన ఈ నిధులను దేశంలోని సుమారు 10.09 కోట్ల మంది లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోసుమారు. రూ. 20,946 కోట్లను జమ చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. కాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద అర్హులైన రైతుల ఖాతాలలోకి ఏడాదికి రూ. 6,000 చోప్పున కేంద్ర మూడు విడతల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 9 విడతల్లో రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం అందచేశారు. ఇవాళ పదో విడత నిధులను ప్రధాని విడుదల చేశారు.
Also Read : Landslide In Haryana : హర్యానాలో కొండ చరియలు విరిగి పడి 15 మంది గల్లంతు
తొలి 9 విడతలకు కలిపి మొత్తం లక్షా 60 వేల కోట్లను విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా ఇవాళ మరో 20 వేల కోట్ల నిధువను విడుదల చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈకార్యక్రమానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధరాష్ట్రాలకు చెందిన మంత్రులు, వ్యవసాయ సంస్ధల ప్రతినిధులు హజరయ్యారు.