Weather Forecast : తెలంగాణలో ఈ రోజు,రేపు వర్షాలు | Weather Forecast

Weather Forecast : తెలంగాణలో ఈ రోజు,రేపు వర్షాలు

ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా వరకు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తున నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది.

Weather Forecast : తెలంగాణలో ఈ  రోజు,రేపు వర్షాలు

Weather Forecast :  తెలంగాణ లో ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా వరకు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తున నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది.

దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని… ఎల్లుండి పొడివాతావరణం ఏర్పడుతుందని అధికారులు చెప్పారు.

 

×