TRS MLA : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.

మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

TRS MLA : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.

TRS MLA : మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈనెల 17వ తేదీన దుల్లాపల్లిలోని మైనంపల్లి ఇంటిదగ్గరికి వెళ్లిన దళిత మహిళలపై అసభ్య ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపిస్తూ మైనంపల్లి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలాగే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం గురించి అడగడానికి వెళ్లిన దళిత మహిళలపై దాడి చేసి దుస్తులు చింపినట్లు మైనంపల్లిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే దళిత మహిళ జజల రమ్య ఫిర్యాదు మేరకు మైనపల్లిపై 354, SEC3(1) (s) SC/ST(POA) act 1989 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ కార్పొరేటర్ కు గాయాలయ్యాయి. అక్కడ మొదలైన వివాదం.. విమర్శలు ప్రతివిమర్శలతో కేసుల వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంలో మైనంపల్లి, బండి సంజయ్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.