CM KCR : మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తాం : సీఎం కేసీఆర్

ఉద్యోగులు చిన్నచిన్న విషయాలకు బెంబేలు పడవద్దని..మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తాంమని సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ ను ప్రారంభ కార్యక్రమంలో ప్రకటించారు.

CM KCR : మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తాం : సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR jangaon Collectorate inaugurated  జ‌న‌గామ‌లో కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందస్భంగా సీఎం మాట్లాడుతూ..జ‌న‌గామ‌లో ఇంత వైభ‌వంగా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించుకుంటామ‌ని ఏనాడూ అనుకోలేదు. కానీ కట్టుకున్నాం. ఈ క‌లెక్ట‌రేట్ లాగా ఏ రాష్ట్రంలో కూడా సెక్ర‌టేరియ‌ట్ లేదని అన్నారు. అనంతరం సీఎం కేసీఆర్..ఉద్యోగులు చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కు బెంబేలెత్తిపోవ‌ద్దని..మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తామని భరోసా ఇచ్చారు.

ఉద్య‌మ స‌మ‌యంలో అండగా నిలిచిన ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని కేసీఆర్‌ తెలాపారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 తెలంగాణలోని గ్రామాలే అని గుర్తు చేశారు. పట్టుదలతో పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమైందన్నారు. , విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాత్రిబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వేరువేరు కాదని అన్నారు.

Also read : CM KCR. : కరవు తాండవించే జనగామ ఇప్పుడు అభివృద్ధి చెందింది : సీఎం కేసీఆర్

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్యోగుల‌కు అండ‌గా నిలిచినవారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని తెలిపారు. మ‌న ఉద్యోగులు ఆర్థికంగా నిల‌బ‌డుతున్నారు. వ‌రంగ‌ల్ జిల్లాకు కానీ, తెలంగాణ‌కు కానీ క‌రువు రాదు. ఆ స‌మ‌స్య లేనే లేదు. క‌రెంట్ స‌మ‌స్య ఉండ‌నే ఉండ‌దని దానికి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అద్భుత‌మైన తెలంగాణ‌ను నిర్మించుకుంటున్నాం. తెలంగాణా అనేక రంగాల్లో అభివృద్ధి పడుతోందని అన్నారు.యాద‌గిరిగుట్ట వ‌ద్ద భూముల‌కు రేట్లు బాగా పెరిగాయని..అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అద్భుత‌మైన ప్ర‌గ‌తి ఉంది. గ్రామీణాభివృద్ధిలో టాప్ టెన్‌లో ఏడు గ్రామాలు తెలంగాణ‌లో ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి, అధికారుల‌ను అభినందిస్తున్నాను. అంద‌రికీ సెల్యూట్ చేస్తున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఏడు సంవ‌త్స‌రాల క్రితం ఎక్క‌డో ఉన్నాం. ఇవాళ అభివృద్ధిలో ఎక్క‌డికో అభివృద్ధి పథంలోకి చేరిందని అన్నారు. ఒకప్పుడు తాను..ప్రొఫెసర్ జయశంకర్ జ‌న‌గామ మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు జనగామ పరిస్థితి చూసి చాలా బాధపడేవారమని గుర్తు చేసుకున్నారు. అప్పుడు చాలా దుర్భ‌ర‌మైన ప‌రిస్థితులు ఉండేవి. సిద్దిపేట నుంచి ఈ మార్గం గుండా వ‌రంగ‌ల్‌కు వెళ్తున్నాను. బ‌చ్చ‌న్న‌పేట మండ‌ల కేంద్రంలో మాట్లాడాలంటే ఆగాను. కేసీఆర్ మీటింగ్‌కు చాలా మంది వృద్ధులు వ‌చ్చారు. 8 సంవ‌త్స‌రాల నుంచి క‌రువు ఉంది. మంచినీళ్లు కూడా లేవు. నాలుగైదు కిలోమీట‌ర్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. యువ‌కులు వ‌ల‌స పోతున్నారు అని ఆనాటి పరిస్థితుల గురించి స్థానికులు చెబుతుంటే విని బ‌చ్చ‌న్న‌పేట‌లో ఏడ్చానని గుర్తుచేసుకున్నారు.

Also read : Pawan Kalyan: ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్

కానీ ఇవాళ రాష్ట్రం సాధించుకున్నాం. ప‌ట్టుబ‌ట్టి ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా, పూర్తి అవినీతిర‌హితంగా ముందుకు వెళ్తున్నాం. దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్ర‌మంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని..వాటన్నింటిని అధిగమించి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి నీటి కరవు సమస్యను పరిష్కరించుకున్నామని తెలిపారు.జ‌న‌గామ‌లో ఇవాళ పంట‌లు అద్భుతంగా పండుతున్నాయి.ఒక‌ప్పుడు జ‌న‌గామ ప‌రిస్థితి చూస్తే క‌న్నీళ్లు వ‌చ్చేవి అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జ‌న‌గామ‌లో అలాంటి ప‌రిస్థితి లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు.