CM KCR: ఈ గోల్‌మాల్ గోవిందాలను ఎందుకు భరించాలి?: సీఎం కేసీఆర్

రాజకీయాలు చేయడమంటే గోల్ మాల్ చేయడం కాదని, అటువంటి గోల్ మాల్ గోవిందంగాళ్లు మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో ఇవాళ పలువురు ఏపీ నేతలు చేరారు. విశ్రాంత ఐఏఎస్ తోట చంద్ర శేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ చింతల పార్థసారథితో పాటు కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడిపాక రమేశ్ నాయుడు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షు‎డి‎గా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏం తెచ్చింది మేకిన్ ఇండియా? ఏం వచ్చింది మేకిన్ ఇండియాతో? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ గోల్‌మాల్ గోవిందంగాళ్లను మనం భరించాలా? అని నిలదీశారు.

CM KCR: ఈ గోల్‌మాల్ గోవిందాలను ఎందుకు భరించాలి?: సీఎం కేసీఆర్

CM KCR

CM KCR: రాజకీయాలు చేయడమంటే గోల్ మాల్ చేయడం కాదని, అటువంటి గోల్ మాల్ గోవిందంగాళ్లు మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో ఇవాళ పలువురు ఏపీ నేతలు చేరారు. విశ్రాంత ఐఏఎస్ తోట చంద్ర శేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ చింతల పార్థసారథితో పాటు కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడిపాక రమేశ్ నాయుడు బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఏం తెచ్చింది మేకిన్ ఇండియా? ఏం వచ్చింది మేకిన్ ఇండియాతో? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ గోల్‌మాల్ గోవిందంగాళ్లను మనం భరించాలా? అని నిలదీశారు.

చైనా లేకపోతే ప్రపంచమే లేదని, ఆ దేశం నుంచే అనేక వస్తువులు ప్రపంచ దేశాలకు చేరుతున్నాయని అన్నారు. భారత్ కి కూడా అన్ని వస్తువులూ చైనా నుంచి వస్తున్నాయని చెప్పారు. చివరకు జెండా కావాలన్నా, గణేశుడి ప్రతిమలు కావాలన్న అక్కడి నుంచే వస్తున్నాయని అన్నారు. ఇవాళ ప్రపంచంలో చైనా స్థానం ఏంటీ? అని ప్రశ్నించారు. నెపాలు చెప్పేవారు నాయకులు కాదని, నెపాలు చెప్పుకుంటూ పోతే సింగపూర్ కూడా అంత గొప్పగా తయారయ్యేది కాదని అన్నారు.

ఒకప్పుడు మన కంటే చైనా జీడీపీ తక్కువగా ఉండేదని చెప్పారు. ఎన్నో దేశాలు గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కొందరు ఎన్నో మాటలు చెబుతున్నారని, దేశానికి చేసింది మాత్రం ఏమీ లేదని చెప్పారు. ఏం కర్మ ఈ దేశానికి? అని ప్రశ్నించారు. తెలంగాణలో అప్పట్లో విద్యుత్తు ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో ఎవరికీ తెలియదని, ఇప్పుడు 24 గంటల విద్యుత్తు ఇస్తున్నామని అన్నారు.

చివరకు ఢిల్లీలో కూడా విద్యుత్ కోతలు ఉన్నాయని చెప్పారు. మరి తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఎలా వచ్చింది? ఒళ్లు వంచి పనిచేస్తే వస్తది అని ఆయన వ్యాఖ్యానించారు. మంచి టీమ్ ను తయారు చేసుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ ఇండియా కోసమేనని అన్నారు. చిల్లర రాజకీయాలు తాము చేయబోమని చెప్పారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షు‎డి‎గా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

Cristiano Ronaldo: క్రిస్టియానో ​​రోనాల్డో భారీ ఒప్పందం.. రోజుకు, నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?