Khammam NTR idol : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బ్రేక్.. హైకోర్టు అనుమతి నిరాకరణ
ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

NTR idol
High Court refused permission : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బ్రేక్ పడింది. ఖమ్మంలో మే28న నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. విగ్రహావిష్కరణకు హైకోర్టు అనుమతిని నిరాకరించింది. విగ్రహావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది.
ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రహాల ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని వాదించారు.
Khammam NTR Statue : ఖమ్మంలో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు
ప్రభుత్వం తరపున అదనపు ఏజీ వాదానలు వినిపిస్తూ విగ్రహంలో పిల్లనగ్రోవి, పించం తొలగించినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదానలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, నిర్వహకులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.