Khammam NTR Statue : ఖమ్మంలో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు

కోర్టు, యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.

Khammam NTR Statue : ఖమ్మంలో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు

Khammam NTR Statue

NTR Statue Changes : ఖమ్మంలో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లకారం ట్యాంక్ బండ్ లో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహావిష్కరణపై యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్ బండ్ లో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ మే12న భారత యాదవ సమితి తరపున ఖమ్మం అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షురాలు కరాటే కళ్యాణి మాట్లాడుతూ దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని చెప్పారు.

Karate Kalyani : శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నిలిపివేయాలి : కరాటే కల్యాణి

ఇది మత విద్వేశాలను రాజకీయ చేసి సమాజంలో అలజడులను సృష్టించే ప్రక్రియగా పేర్కొన్నారు. రాజకీయ నేతలను దేవుడి రూపంలో పెట్టడం కరెక్ట్ కాదని తెలిపారు. అభిమాన నటుడైనా భగవంతుడి కంటే ఎక్కువ కాదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విగ్రహం పెడుతున్నారని ఆరోపించారు. ఈ వివాదం కోర్టుకు చేరింది.

ఈ నేపథ్యంలో ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ లో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో యాదవ సంఘాల అభ్యర్థనను గౌరవిస్తూ ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు చేశారు. నీలిమేఘ శ్యాముడుగా ఉన్న శ్రీ కృష్ణుడి విగ్రహానికి నిర్వాహకులు కలర్ మార్చి గోల్డ్ కలర్ వేస్తున్నారు.

Sri Krishna Birthplace : శ్రీకృష్ణుడు జన్మస్థలంగా చెబుతున్న మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది ?

అలాగే విగ్రహంలోని కిరీటంలో ఉన్న నెమలి పించం, కిరీటం వెనుక భాగంలో ఉన్న విష్ణు చక్రం, పిల్లన గ్రోవీ లను తొలగించారు. కోర్టు, యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. మే28న ఎన్ టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్ టీఆర్, సినీ రంగ ప్రముఖులు, ఎన్ ఆర్ ఐలు హాజరు కానున్నట్లు తెలిపారు.