Lafayette College: తెలంగాణ విద్యార్థినికి రూ.2 కోట్ల స్కాలర్ షిప్!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని ఇప్పుడు ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ పొందింది. శ్వేతారెడ్డి అనే విద్యార్థిని అత్యంత ప్రతిష్టాత్మకమైన లాఫాయెట్ కాలేజీలో స్కాలర్ షిప్ పొందింది. ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా..

Lafayette College: తెలంగాణ విద్యార్థినికి రూ.2 కోట్ల స్కాలర్ షిప్!

Lafayette College

Lafayette College: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని ఇప్పుడు ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ పొందింది. శ్వేతారెడ్డి అనే విద్యార్థిని అత్యంత ప్రతిష్టాత్మకమైన లాఫాయెట్ కాలేజీలో స్కాలర్ షిప్ పొందింది. ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా.. శ్వేతారెడ్డి నాలుగేళ్ళ స్కాలర్ షిప్ తో పాటు స్కాలర్ షిప్ ను కూడా దక్కించుకుంది.

డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయెట్ కాలేజీ ప్రతి ఏడాది ఆరుగురు విద్యార్థులకు మాత్రం ఈ స్కాలర్ షిప్ అందిస్తుంది. కాగా ఈ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో శ్వేతారెడ్డి ఉండడం తెలుగు విద్యార్థులకు గర్వకారణంగా మారింది. శ్వేతా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు చూసే లాఫాయెట్ ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.