Hyderabad Old City: పాత‌బస్తీలో ఉద్రిక్త వాతావరణం.. రాజాసింగ్‌‌కు వ్యతిరేకంగా నినాదాలు .. భారీగా పోలీసుల బందోబస్తు

పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో స్థానిక యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. చార్మినార్ వద్ద పెద్ద‌సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Hyderabad Old City: పాత‌బస్తీలో ఉద్రిక్త వాతావరణం.. రాజాసింగ్‌‌కు వ్యతిరేకంగా నినాదాలు .. భారీగా పోలీసుల బందోబస్తు

Old City

Hyderabad Old City: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో రాజాసింగ్ నేరుగా గోషామహల్ లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం, అదే సమయంలో రాజాసింగ్ కు వ్యతిరేకంగా పాతబస్తీలో కొందరు నినాదాలు చేశారు. ఇరువర్గాల నిరసనల నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు పాతబస్తీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

మంగళవారం అర్థరాత్రి సమయంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో స్థానిక యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. చార్మినార్ వద్ద పెద్ద‌సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే మొఘల్ పురాలో వోల్టా క్రాస్ రోడ్డులో పోలీస్ వాహనంపై నిరసనకారులు రాళ్లురువ్వారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం వారితో చర్చించి వారిని తిరిగి పంపించివేశారు.

Raja Singh : ధర్మం కోసం నేను చావటానికైనా సిద్ధం .. చచ్చే వరకు బీజేపీ కార్యకర్తగానే ఉంటా..

రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొందరు పాతబస్తీ యువత బుధవారం ఉదయంసైతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉండటంతో పాతబస్తీ నుంచి గోషామహల్ కు వెళ్లే రోడ్లన్నీ పోలీసులు మూసివేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజాసింగ్ ను అరెస్టు చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వస్తుండటంతో బేగంబజార్ లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.