Warangal : పొలం దున్నుతుండగా వ్యవసాయ బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ దుర్మరణం
ఈ క్రమంలో ట్రాక్టర్ రివర్స్ వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ఇంజిన్ సహా డ్రైవర్ వ్యవసాయ బావిలో పడిపోయాడు.

tractor fell well
tractor fell well : వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వ్యవసాయ బావిలో పడి డ్రైవర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర కీమ అనే ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం తెల్లారుజామున చెన్నారావుపేట మండలంలోని లింగాపురంలో ట్రాక్టర్ తో పొలం దున్నుతున్నాడు.
ఈ క్రమంలో ట్రాక్టర్ రివర్స్ వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ఇంజిన్ సహా డ్రైవర్ వ్యవసాయ బావిలో పడిపోయాడు. బావిలో ట్రాక్టర్ తలకిందులుగా పడిపోవడంతో ఇంజిన్ తోపాటు డ్రైవర్ నీట మునిగిపోయాడు.
Buddha Venkanna : అందుకే.. కేశినేని నాని వ్యాఖ్యలపై మాట్లాడటం లేదు : బుద్దా వెంకన్న
దీంతో ఊపిరాడక అతడు బావిలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.