Buddha Venkanna : అందుకే.. కేశినేని నాని వ్యాఖ్యలపై మాట్లాడటం లేదు : బుద్దా వెంకన్న

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో ఉన్నందుకే జగన్ అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని తెలిపారు.

Buddha Venkanna : అందుకే.. కేశినేని నాని వ్యాఖ్యలపై మాట్లాడటం లేదు : బుద్దా వెంకన్న

Buddha Venkanna (2)

Amaravati Buddha Venkanna : తనను ఎవరేం విమర్శించినా తొందరపడనని చంద్రబాబుకు మాటిచ్చాను.. కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తెలిపారు. తన స్పందన వల్ల పార్టీకి నష్టం చేకూర్చకూడదనే తాను మాట్లాడటం లేదన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

బీసీ నాయకుడి అయిన తనను కేశినేని నాని ఎన్నోసార్లు అవమానించారు.. ఇప్పటికీ నాని గారంటూనే కేశినేని నానిని సంబోధిస్తాను అని పేర్కొన్నారు. కేశినేని నాని తనను ఎన్ని సార్లు అవమానించిన సైలెంటుగా ఉన్నానని చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మాట్లాడానని చంద్రబాబుకు మాటిచ్చానని తెలిపారు.

CM KCR : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం

నాని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. నానికి తనకు భేదాభిప్రాయాలు వచ్చి విడిగా ఉంటున్నామని వెల్లడించారు. గతంలో కేశినేని నానిపై తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటే.. ఈ విషయాన్ని గతంలోనే ఒప్పుకున్నానని పేర్కొన్నారు. కేశినేని నానిని ఆ స్థాయిలో విమర్శించడంపై చంద్రబాబు తనపై అప్పట్లో కొప్పడ్డారని వెల్లడించారు.

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో ఉన్నందుకే జగన్ అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని తెలిపారు. ఈసారి వైఎస్సార్ పైనుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడని జగన్ కు అర్ధమవటంతో ఇక పర్యటన అనవసరం అనుకున్నారని పేర్కొన్నారు.

Delhi Metro : మెట్రోని ఆపడానికి కాలితో డోర్ లాగిన ఆకతాయిలు.. మండిపడుతున్న ప్రయాణికులు

అవినాష్ రెడ్డి అరెస్టుపై సీబీఐ డొంకతిరుగుడు వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ గొట్టంగాళ్లంతా చంద్రబాబుకు ప్రాణహని తలపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సునీతా రెడ్డి పులివెందుల పులి అయితే జగన్ పిల్లి మాత్రమేనని తేల్చి చెప్పారు.