Delhi Metro : మెట్రోని ఆపడానికి కాలితో డోర్ లాగిన ఆకతాయిలు.. మండిపడుతున్న ప్రయాణికులు
ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. మెట్రోను ఆపడానికి ఇద్దరు ఆకతాయిలు కాలితో డోర్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

Delhi Metro
Delhi Metro Viral Video : ఢిల్లీ మెట్రోను ఆపడానికి ఇద్దరు యువకులు ఆకతాయిగా చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. సోషల్ మీడయాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మెట్రో ఈ ఘటనపై స్పందించింది.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు యువతులు.. మండిపడుతున్న ప్రయాణికులు
మెట్రోలో కొందరు ఆకతాయిలు చేసే పనులు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఢిల్లీ మెట్రోలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. వారిలో ఇద్దరు మెట్రోను ఆపడానికి తలుపులు మూయకుండా కాలితో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతోంది. Aman అనే ట్విట్టర్ యూజర్ ‘ఇలాంటి వ్యక్తుల వల్ల మెట్రో ఆలస్యం అవుతోంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోపై ఢిల్లీ మెట్రో అథారిటీ కూడా స్పందించింది. ‘శిక్షార్హమైన నేరం’ అనే మెట్రో అధికారులు సైతం సమాధానం ఇచ్చారు.
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో యువకుడి అసభ్యకర ప్రవర్తన.. తలదించుకొని వెళ్లిపోయిన మహిళలు.. కేసు నమోదు
మెట్రో కోచ్ లోపల నుంచి తీసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు తలుపులకు రెండు వైపులా నిలబడి దానిని మూసివేయకుండా పాదాలతో ఆపడానికి ప్రయత్నించారు. కోచ్ లోపల నుంచి ఒక ప్రయాణికుడు వారిని ఆపమని అడిగే వరకూ వారు ఇలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ‘ప్రయాణీకులు ఇలాంటి ప్రవర్తనను గమనించినట్లయితే DMRC హెల్ప్‌లైన్‌ని 155370కి సంప్రదించవచ్చు” అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వీడియోపై స్పందిస్తూ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేసింది.
Ase logo ki wajhse metro (@OfficialDMRC) late hoti hai🤦 pic.twitter.com/l7nopyU6UK
— Aman (@imb0yaman) June 8, 2023