MLA Rajaiah: బుల్లెట్ బండి పాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అద్దిరిపోయే స్టెప్పులు!

సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో చెప్పడం సాధ్యం కాదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి తెలిసిందే.

MLA Rajaiah: బుల్లెట్ బండి పాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అద్దిరిపోయే స్టెప్పులు!

Mla Rajaiah

MLA Rajaiah: సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో చెప్పడం సాధ్యం కాదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి తెలిసిందే. ఎక్కడ చూసినా బుల్లెట్ బండి పాట తెగ వైరల్ అవుతుంది. పెళ్లి వేడుకల నుండి ఆసుపత్రులలో ట్రీట్మెంట్ వరకు ఈ పాటే అన్నిటికి ఉపయోగిస్తున్నారు. పెళ్లి బరాత్‌లో నవ వధువు సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ తో సోషల్ మీడియాలో వైరలైన బుల్లెట్టు బండి సాంగ్ మారుమోగిపోతోంది.

ప్రతి ఒక్కరూ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తవా… అంటూ ఆడి పాడుకుంటున్నారు. ఫంక్షన్ ఏదైనా, సందర్భంగా ఏదైనా… సరదా కోసమైనా, రిలీఫ్ కోసమైనా.. బుల్లెట్టు బండి పాట పెట్టుకుని డుగ్గు డుగ్గుమంటూ ఆడాల్సిందే. సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఈ పాటను పాడుతూ, వేడుకల్లో అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు. మొన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత పెళ్లి వేడుకలో ఈ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేస్తే ఇప్పుడు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కూడా స్టెప్పులు వేశారు.

జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య ఈ సందర్భంగా చిన్నారులు డాన్సు వేస్తుంటే బుల్లెట్ పాట రాగానే స్టేజ్ పైకి వెళ్లి చిన్నారులతో కలసి బుల్లెట్ బండి పాటకు స్టేప్పలు వేశారు. కాలు కదుపుతూ.. చేతులు తిప్పుతూ.. తానే తిరుగుతూ.. హుషారుగా డ్యాన్స్‌లు వేశారు. ప్రస్తుతం రాజయ్య చేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.