Telangana assembly session: అన్ని విషయాలు ప్రజలకు తెలిపేందుకు డిసెంబరులో శాసనసభ సమావేశాలు: కేసీఆర్

డిసెంబరులో తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఏడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులతో పాటు కేంద్ర సర్కారు విధిస్తున్న ఆంక్షలపై ఇందులో చర్చించనున్నారు. అన్ని విషయాలు ప్రజలకు తెలిపేందుకు డిసెంబరులో శాసనసభ సమావేశాలు ఉంటాయని కేసీఆర్ అన్నారు.

Telangana assembly session: అన్ని విషయాలు ప్రజలకు తెలిపేందుకు డిసెంబరులో శాసనసభ సమావేశాలు: కేసీఆర్

Telangana Assembly

Telangana assembly session: డిసెంబరులో తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఏడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులతో పాటు కేంద్ర సర్కారు విధిస్తున్న ఆంక్షలపై ఇందులో చర్చించనున్నారు. అన్ని విషయాలు ప్రజలకు తెలిపేందుకు డిసెంబరులో శాసనసభ సమావేశాలు ఉంటాయని కేసీఆర్ అన్నారు.

కేంద్ర సర్కారు ఆంక్షలతో తెలంగాణ ఆదాయం రూ.40 వేల కోట్లు తగ్గుతోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సర్కారు మోకాలడ్డుతోందని ఆరోపించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డికి కేసీఆర్ చెప్పారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ప్రోరోగ్ కాకపోవడంతో ఆ సమావేశాలకు కొనసాగింపుగానే డిసెంబరు సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.

దీంతో మళ్ళీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉండకపోవచ్చు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇక్కడి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ అంశంపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..