Yashwant Sinha: నామినేషన్ వేసి మోదీకి ఫోన్ చేస్తే.. అందుబాటులోకి రాలేదు – యశ్వంత్ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు CM కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. ఆయన రాకకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ తో పాటు యశ్వంత్ సిన్హాకు మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు.

Yashwant Sinha: నామినేషన్ వేసి మోదీకి ఫోన్ చేస్తే.. అందుబాటులోకి రాలేదు – యశ్వంత్ సిన్హా

Cm Kcr

Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు CM కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. ఆయన రాకకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ తో పాటు యశ్వంత్ సిన్హాకు మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో జలవిహార్ కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన యశ్వంత్ సిన్హా.. తాను నామినేషన్ వేసిన తర్వాత ప్రధానికి ఫోన్ చేస్తే ఇప్పటివరకూ మాట్లాడటం కుదరలేదని అన్నారు. ఎన్నికలు జరగనున్న తీరు.. ప్రధాన మంత్రి మోదీ వ్యవహరిస్తున్న విధానం గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“నామినేషన్ వేసిన తరువాత మోదీకి ఫోన్ చేశా. అందుబాటులోకి రాలేదు. ఆయనతో మాట్లాడటం.. ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. అసాధారణ పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థిని ఓ ఆదివాసి మహిళగా చెబుతుంది బీజేపీ. ప్రధాని ఇతరులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు”

Read Also: మోదీ వల్ల దేశం పరువు పోతోంది.. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు?

“ఇది ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే ఎన్నిక కాదు. విధానపరమైన అంశాలపై జరుగుతున్న ఎన్నికలు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్లుగా మీడియా సమావేశం నిర్వహించే ధైర్యం చేయలేదు. ఇక్కడ నా ప్రచారం చూస్తూంటే ప్రజల ఉద్యమంగా మారింది. కేంద్రంపై పోరాటం ఫలితాలతో సంబంధం లేకుండా జరుగుతుంది. కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ లాంటి నేతలు అవసరం”

“అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపించారు. ఇది ఒక అద్భుతం. ప్రజల గురించి ఆలోచించే వాళ్ళకే ఇది సాధ్యం. దేశాన్ని కాపాడేందుకు మా పోరాటం. ఇది దేశ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటం. రాష్ట్రపతిగా ఎన్నికైతే భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కాపాడడం నా లక్ష్యం. కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వలేరు” అంటూ ఘాటుగా స్పందించారు యశ్వంత్.