Horoscope Today: మళ్లీ కాలసర్పదోషం యాక్టివేటెడ్‌.. ఈ రాశుల వారికి నష్టాలు..!

రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు బెడిసికొడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

Horoscope Today: మళ్లీ కాలసర్పదోషం యాక్టివేటెడ్‌.. ఈ రాశుల వారికి నష్టాలు..!

Today Horoscope

Updated On : May 21, 2025 / 1:00 AM IST

Horoscope Today: పక్షం రోజుల కిందట డీ యాక్టివేట్‌ అయిన కాలసర్పదోషం.. ఈ రోజు మళ్లీ యాక్టివేట్‌ అవుతున్నది. ఫలితంగా పరిస్థితులు ప్రతికూలంగా పరిణమిస్తాయి. ఈ దోషం కారణంగా మిథునం, వృశ్చికం, కుంభ రాశులకు నష్టాలు ఏర్పడతాయి. వృషభం, కన్య రాశులవారికి ఆకస్మిక లాభాలు చేకూరుతాయి.

మేషం: రోజంతా సజావుగా సాగుతుంది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. సోదర మూలకంగా పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం: ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఉల్లాసంగా ఉంటారు. భోజన సౌఖ్యం ఉంది. పితృవర్గానికి మేలు కలుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.
మిథునం: రోజంతా ఆందోళనకరంగా గడుస్తుంది. అయినవారిని దూరం చేసుకోకండి. మాట పొదుపుగా వాడటం మంచిది. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. రామాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం: ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మాట నిలుపుకోవడానికి చాలా కష్టపడాలి. దైవబలం చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. కాలభైరవాష్టకం పఠించండి.
సింహం: మిశ్రమంగా ఉంటుంది. లేనిపోని భయాలు చుట్టుముడతాయి. తెలివిగా వాటిని ఎదుర్కోవడం అవసరం. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య: శత్రువులపై విజయం సాధిస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం సూచితం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
తుల: రోజంతా ప్రశాతంగా సాగుతుంది. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు గడిస్తారు. ఆదిత్య హృదయం వినండి.
వృశ్చికం: రోజంతా అస్తవ్యస్తంగా సాగుతుంది. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు బెడిసికొడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. హనుమాన్‌ చాలీసా పఠించండి.
ధనుస్సు: నిన్నటి అవకాశం ఈ రోజు చేజారిపోతుంది. పట్టుదలకు పోయి ముగింపు దాకా వచ్చిన పనిని వదిలేస్తారు. సంయమనం పాటించడం చాలా అవసరం. కుటుంబసభ్యుల మాట వినండి. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
మకరం: కుటుంబంలో కలహ వాతావరణం ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం: గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మీ అభివృద్ధికి కారణమైన వారిని విస్మరించి పొరపాటు చేస్తారు. ఫలితంగా తీవ్ర పరిణామాలు తప్పవు. అయినవారిని దూరం చేసుకోకండి. శివారాధన చేసుకోండి.
మీనం: ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.