Agnastra Preparation : అగ్నాస్త్రం తయారీలో రైతులకు శిక్షణ.. చీడపీడల నివారణకు కషాయాల పట్ల అవగాహన..!

Agnastra Preparation : పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయ విభాగం  జిల్లా కో ఆర్డినేటర్ అరుణ కుమారి ఎకరం వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నారు.

Agnastra Preparation : అగ్నాస్త్రం తయారీలో రైతులకు శిక్షణ.. చీడపీడల నివారణకు కషాయాల పట్ల అవగాహన..!

Preparation of Agnastra

Updated On : November 16, 2024 / 2:26 PM IST

Agnastra Preparation : సేంద్రియ సాగుకు ప్రాధాన్యం పెరిగినా.. సాగులో వినియోగించే ఎరువులు, కషాయాల తయారీ రైతులకు కష్టతరంగా మారింది. దీనిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకృతి వ్యవసాయ విభాగం రైతులకు సేంద్రియ సాగు.. కషాయాల తయారీ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన  కోఆర్డినేటర్.. స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ..  కషాయాల తయారీ పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

నత్తలు, మిత్ర పురుగులు, వానపాముల వంటివి పంటకు ప్రాణాధారం. వాటిని వదిలేసి నేలతల్లికి, పర్యావరణానికి హాని చేసే ఎరువులు, పురుగుల మందులు రాజ్యమేలుతున్న కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుని రాణిస్తున్నారు చాలా మంది రైతులు. ఈ కోవలోనే ఆంద్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే వారు సైతం ఆయా ప్రాంతాలలో కొత్తి విస్తీర్ణంలో కౌలుకు వ్యవసాయ భూములను తీసుకొని ముందుగా వారు వ్యవసాయం చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీసి ఆ తరువాత చుట్టుప్రక్కల ఉన్న రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్నారు.

ఇందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయ విభాగం  జిల్లా కో ఆర్డినేటర్ అరుణ కుమారి ఎకరం వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నారు. పంటకు ఆశించే చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలు తయారుచేసి వాడుతున్నారు. అంతే కాకుండా చుట్టుప్రక్కల రైతులకు ఈ కషాయల ఉపయోగం.. వాటి తయారీ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వరికి  కాండం తొలుచు పురుగు ఆశించడంతో అజ్ఞాస్త్రం తయారు చేయించి పిచికారి చేస్తున్నారు. అసల అజ్ఞాస్త్రం ఎలా తయారు చేస్తారు.. దీని వాడకంతో ఎలాంటి పురుగులు చనిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రకృతిలోని సహజ వనరులైన సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి, మేలైన యాజమాన్య పద్ధతులతో..  సుస్థిరమైన పంటలు ఉత్పాదకతతో..  ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించే విధానమే..  సేంద్రీయ వ్యవసాయం. ఈ పద్దతుల ద్వారా పండిన వాటిని సేంద్రీయ ఉత్పత్తులు అంటారు. వ్యవసాయంలో సుస్థిరత తేవాలంటే లాభసాటి వ్యవసాయానికి, నిలకడగా దిగుబడులు పొందడానికి, వ్యవసాయ సుస్థిరత ఎంతో ముఖ్యమైనది. ఆహార భద్రతకు పౌష్టికాహార ఉత్పత్తికి, సహజ వనరులు, పరిసరాల పరిరక్షణకు తోడ్పడుతుంది. అందుకే చాలా మంది రైతు ఈ విధానం పట్ల ఆకర్షితులై సాగు విస్తీర్ణం పెంచుతున్నారు.

పొలాల్లోనే కాదు పెరడు, మిద్దెపై సాగుచేసే పంటలకు చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. వాటి నివారణకు రసాయన మందులకు బదులు సేంద్రియ పద్ధతుల్లో కషాయాలను, ద్రావణాలను తయారుచేసి వినియోగించడం ద్వారా అధిక ప్రయోజనం ఉంటుంది. వీటి సులువుగా .. చౌకగా , సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ సస్యరక్షణ పద్ధతులు పర్యావరణానికి, వినియోదారులకు సురక్షితమైనవి.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..