Crop Protection : విత్తన శుద్దితోనే చీడపీడల నివారణ- పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడులు

Crop Protection : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.

Crop Protection : విత్తన శుద్దితోనే చీడపీడల నివారణ- పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడులు

Benefits of Seed Treatment for Crop Protection

Updated On : June 7, 2024 / 2:30 PM IST

Crop Protection : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకు చీడపీడలు సమస్య అధికం అవుతుండడంతో తెగుళ్ళను, పురుగులను నియంత్రించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ, విత్తడానికి ముందే విత్తనశుద్ధి చేయడం ద్వారా విత్తనం, నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే.. విత్తనశుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం  అధికంగా ఉండి, మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు.

విత్తన శుద్ధి  విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి , తొలిదశలో పురుగులు, తెగుళ్ళను  ఆరికట్టి , తర్వాత దశలో పిచికారి మందులు కూలీల పై పెట్టె ఖర్చును తగ్గించుకోడానికి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసి తర్వాత నీడలో ఆరబెట్టాలి. శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేసి చివరిగా జీవ రసాయన మందులు లేదా జీవన ఎరువులతో  విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తెగుళ్లు సోకాక పంటపై మందులు పిచికారి చేసే కంటే, ముందే విత్తనశుద్ధి చేయడం సులువైన పని. దీని వల్ల కూలీ ఖర్చు, శ్రమ, వాతావరణ కాలుష్యం తగ్గుతాయి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు