Cattles Care during Winter : చలికాలంలో పాడిపశువుల పెంపకం – పాల దిగుబడికి పాటించాల్సిన జాగ్రత్తలు
Care of dairy cattle during winter : శీతాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సమస్యలు ఎదురవుతూనే వుంటాయి. ముఖ్యంగా పాలదిగుబడి తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది.

Care of dairy cattle during winter
Care of dairy cattle during winter : ఏకాలంలో వుండే సమస్యలు ఆ కాలంలో వుంటాయి. ఇది మనుషులకే కాదు-మూగ జీవాలకూ వర్తిస్తుంది. పాడిపరిశ్రమనే తీసుకుంటే.. వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే మన రైతాంగం మిగిలిన కాలాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో పశువులు సరిగా మేత మేయక, పాలదిగుబడి తగ్గుతుంది.
Read Also : Red Gram Cultivation : కందిపంటలో శనగపచ్చ పురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
ఈ కాలంలోనే గేదెలు ఎక్కవగా ఎదకు వస్తుంటాయి. కనుక శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా వుంటూ, వాటికి అందిచే దాణాల్లో తగు మార్పులు చేసుకుంటూ, సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే పరిశ్రమ లాభసాటిగా వుంటుంది. మరి, పాడి పరిశ్రమలో శీతాకాలంలో ఎటువంటి మెలకువలు పాటించాలో చూద్దామా..
శీతాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఈకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సమస్యలు ఎదురవుతూనే వుంటాయి. ముఖ్యంగా పాలదిగుబడి తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. రైతులు సాధారణంగా పాలను ప్రతిరోజు 12 గంటల వ్యవధిలో పితుకుతుంటారు. చలికాలంలో పగటి సమయం తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది.
శీతాకాలంలో పాడి పశువుల జాగ్రత్తలు :
కాబట్టి పాలను ఈకాలంలో ఉదయం 6-7 గంటల మధ్య, సాయంత్రం 4-5 గంటల సమయంలో పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువు శరీరం వేడిగా ఉండటానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేని పక్షంలో మేత సరిగా తినక, పాల దిగుబడి తగ్గే అవకాశం వుంది. ఈకాలంలో పాడి పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డా. సురేష్ రాథోడ్.
పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడిపశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలామంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధకనబరచటం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా వుండి, పరిశ్రమ కుంటుపడుతోంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతోపోలిస్తే, మన దొడ్లో పుట్టిన దూడ, పాడిపశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి లేగదూడలు మంచి పాడిపశువుగా అందిరావాలంటే చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
Read Also : Tobacco Leaves Cultivation : లాభదాయకంగా మారిన పొగాకు సాగు