Cotton Farming : పత్తితీతల అనంతరం చేపట్టాల్సిన జాగ్రత్తలు

Cotton Farming : కొంత మంది రైతులు పత్తి తీత తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు పత్తి కట్టెలను కాల్చేస్తారు.

Cotton Farming : పత్తితీతల అనంతరం చేపట్టాల్సిన జాగ్రత్తలు

cotton farming techniques and management

Updated On : February 4, 2024 / 5:19 PM IST

Cotton Farming : పత్తి పంటకు గులాబి రంగు పురుగు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం  ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గులాబిరంగు పురుగుల ఉధృతి పెరిగింది. ముందుగా విత్తిన పంటలో పత్తితీతలు దాదాపుగా పూర్తవగా, ఆలస్యంగా వేసిన రైతులు మాత్రం రెండు మూడు సార్లు పత్తిని తీశారు. అయితే పత్తిలో గులాబిరంగు పురుగును అరికట్టాలంటే పత్తి పంటను పొడగించకుండా పలుజాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాంప్రసాద్.

Read Also : Mirchi Crop Cultivation : మిరపను కోసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

ప్రధానమైన వాణిజ్య పంటలలో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో, పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. గత మూడు, నాలుగేళ్ల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది.  ఇటీవల కాలంలో ఈ పురుగు ఉద్ధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75-80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయిన పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.

ముఖ్యంగా పత్తి తీసిన తర్వాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబి రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంత మంది రైతులు పత్తి తీత తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు పత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని గులాబిరంగు పురుగును ఎలా అరికట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాంప్రసాద్.

Read Also : Bananna Cultivation : ఆయిల్ ఫాంలో అంతర పంటగా అరటి సాగు