Crop Protection : మామిడి పూత, కాత సమయంలో పురుగులు, తెగుళ్ల బెడద
Crop Protection : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు.

Crop Protection Measures
Crop Protection : తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా పూత ప్రారంభం కాలేదు. గత రెండేళ్లుగా రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ సారి మంచి ఫలితాలు సాధించాలంటే, పూత దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా.. పిందె కాయ దశలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణను సమగ్రంగా నివారించాలి.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..
లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ చీడపీడల నివారణకు, రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తేలియజేస్తున్నారు, నూజిబీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాధారాణి .
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం అక్కడక్కడ మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. అయితే మామిడి పంటలో పూతదశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేతలంటున్నారు. అంతే కాదు పూత నుండి కాయ దశలో మారాకా కూడా పురుగులు, తెగుళ్లు అధికంగానే ఆశిస్తుంటాయి.
ముఖ్యంగా పండుఈగ, కాయతొలుచుపురుగు, బూడిదతెగులు, పక్షికన్నుతెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించాలి. అంతే కాదు కాయ దిగుబడి నాణ్యంగా ఉండాలంటే సకాలంలో సూక్ష్మపోషకాలను అందించాలని వివరాలు తెలియజేస్తున్నారు నూజిబీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాధారాణి.
Read Also : Paddy Cultivation : గిర్ ఆవులతో వరి సాగు.. 5 ఏళ్ళుగా ఆవు మజ్జిగతో వ్యవసాయం