Dry crops : వరి మాగాణుల్లో వేయాల్సిన ఆరుతడి పంటలు

Dry crops : తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన ఆహార ధాన్యపు పంట. గత రెండు మూడేళ్ళుగా మన రాష్ట్రాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

Dry crops : వరి మాగాణుల్లో వేయాల్సిన ఆరుతడి పంటలు

Dry crops in Paddy Cultivation Techniques

Updated On : December 21, 2024 / 2:44 PM IST

Dry crops : వరి మాగాణుల్లో రబీ మినుము, పెసర లాంటి ఆరుతడి పంటలు వేసేందుకు ఇది మంచి సమయం. వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే.. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో, స్వల్పకాలంలో చేతి కొచ్చే పంటలు అపరాలు. సాగులో కొద్దిపాటి  యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలను తీసుకోవచ్చు. అయితే వరి మాగాణుల్లో ఎలాంటి ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన ఆహార ధాన్యపు పంట. గత రెండు మూడేళ్ళుగా మన రాష్ట్రాలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం సాగునీటి లభ్యత పెరగడమే. వానాకాలం వరి తరువాత రెండవ పంటగా మళ్ళీ వరి వేయడం లేదా ఇతర ఆరుతడి పంటలను సాగుచేయడం మన రాష్ట్రంలో సాధారణంగా జరుగుతోంది. కానీ చాలా తక్కువ శాతం రైతులు వరి తర్వాత మిగిలి ఉన్న తేమను సద్వినియోగపరచుకోని వరి మాగాణుల్లో స్వల్పకాలిక అపరాలు, నూనెగింజల సాగు చేస్తున్నారు.

అయితే, తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందేందుకు ఇప్పుడు వరిమాగాణుల్లో వేయాల్సిన పంటలు.. ఏ సమయంలో సాగుచేయాలో రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రజినికాంత్.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు