Lilly Farming : లిల్లీ పూల సాగుతో రైతులకు మంచి ఆదాయం

Lilly Farming : ఏ సీజన్లో అయినా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన రైతులు,  పత్తి, వరి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు కాకుండా  పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు.

Lilly Farming : లిల్లీ పూల సాగుతో రైతులకు మంచి ఆదాయం

Earn Huge Profits With Lilly Farming Techniques

Updated On : September 21, 2024 / 3:01 PM IST

Lilly Farming : లిల్లీ పూల సాగుతో రైతులు మంచి ఆదాయం గడిస్తున్నారు. ఒకప్పుడు అరకొరగా సాగుచేసే ఈ పంటకు నిలకడైన ధర ఉండటంతో.. నెల్లూరు జిల్లాలో రైతులు ఈ పూలతోటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. మొక్క నాటిన రెండు మూడేళ్లపాటు పూల దిగుబడులు రావడంతో సంప్రదాయ పంటలకు స్వస్తిపలికి ఈపూలసాగుచేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు.

Read Also : Cotton Crop : పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు 

ఏ సీజన్లో అయినా పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన రైతులు,  పత్తి, వరి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు కాకుండా  పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ నీటిని ఉపయోగించి.. పంట సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో రెండు మూడేళ్ళ పాటు దిగుబడివచ్చే లిల్లీ పూలను సాగుచేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు నెల్లూరు జిల్లా, కలువాయికి చెందిన కొందరు రైతులు.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ లిల్లిపూల తోట, కలువాయి గ్రామంలో ఉంది. దీన్ని సాగుచేస్తున్న రైతు పేరు వెంకట్. గతంలో ఎకరా, రెండెకరాల్లో సాగయ్యేది ఈ పంట. అధికంగా ఇక్కడ తమలపాకు పంటను సాగుచేసే రైతులు.. చీడపీడలతో పాటు మార్కెట్ లో సరైన మద్ధతు ధర రాకపోవడంతో.. లిల్లీపూల సాగుకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ లో కూడా మంచి ధర వస్తుండటంతో… కలువాయి మండలంలో 70 నుండి 80 ఎకరాల్లో లిల్లీ పూలతోటలు సాగవుతుంది. పొలాల దుక్కులు, రసాయన మందులు, పూల కోత ఇలా,.. దిగుబడి వచ్చేంత వరకు ఎకరాకు లిల్లీ సాగుకు రూ.లక్ష  వరకు పెట్టుబడి అవుతుంది.

పూల మొక్కలు నాటినప్పటి నుంచి నాలుగు నెలలకు దిగుబడి ప్రారంభమవుతుంది. పొలంలో ఒకసారి నాటినట్లయితే రెండేళ్ళపాటు దిగుబడి వస్తుంది. అయితే సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మూడేళ్ల వరకు పూల దిగుబడి వస్తుంది. కోత మంచి అదును మీద ఉన్నప్పుడు ప్రతి రెండు రోజులకోసారి పూలు కోయాల్సి ఉంటుంది. మందులు, కూలీల ఖర్చు తక్కువగా ఉండడంతో లిల్లీ సాగుపై శ్రద్ధ చూపుతున్నారు రైతులు. మిగతా పూలతో పోల్చితే లిల్లీ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉండటంతో లాభాలను ఆర్జిస్తున్నారు. 

Read Also : Paddy Crop Cultivation : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు