Farmers Facing Problems : ఏజెన్సీ రైతులకు దక్కిని మద్ధతు ధరలు

Farmers Facing Problems : గిరిజన రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధరలు చెల్లించడం లేదు . అధికారులు స్పందించి గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

Farmers Facing Problems : ఏజెన్సీ రైతులకు దక్కిని మద్ధతు ధరలు

Farmers Facing Problems With Lack Of Minimum Price

Updated On : January 30, 2024 / 3:31 PM IST

Farmers Facing Problems : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో రైతులు పూర్తిగా సేంద్రి వ్యవసాయమే చేస్తుంటారు. దేశవాళి రకాలతో పాటు.. ఆధునిక పంటలు సైతం పండిస్తారు. అయితే తీరా పంటలు చేతికొచ్చాక గిట్టుబాటు ధరలు మాత్రం రావడంలేదు. బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముకుంటున్న దళారులు.. గిరిజన రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధరలు చెల్లించడం లేదు . అధికారులు స్పందించి గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.

Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం  

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలో ఆది నుంచీ సేంద్రీయ విధానంలోనే గిరిజనులు సాగు చేస్తున్నారు. రాగులు, కొర్రలు, సామలు, చింతపండు, అరటి, సీతాఫలాలు, రామఫలాలు, పనస పళ్లు, కూరగాయలు ఇలా సహజ సిద్ధమైన పంటలు పండుతున్నాయి. వీటికి ఎటువంటి రసాయన ఎరువుల వాడకం ఉండదు. అటవీ ప్రాంతంలో, కొండ వాలులో సారవంతమైన మట్టి ఉండటం సహజ సిద్ధ పంటకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో కొట్టుకు వచ్చే సారవంతమైన మట్టి కావడంతో రసాయన ఎరువులు అవసరం లేదు.

దీనికితోడు గిరిజనులు ఎక్కువగా పశువులను పెంచుతుంటారు. వాటి గత్తాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇవన్నీ సేంద్రీయ సాగు విధానంలో భాగమే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఇదే. అయితే పండిన పంటను, సేకరించిన ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుంటారు. అయితే మద్దతు ధర రాకపోవడం.. కొనుగోలుకు అవకాశం లేకపోవడంతో శ్రమే మిగులుతోందని వాపోతున్నారు.

Read Also : Tribal Rabi Paddy : రబీ వరిలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం