Tribal Rabi Paddy : రబీ వరిలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం

Tribal Rabi Paddy : కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్దమవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది.

Tribal Rabi Paddy : రబీ వరిలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం

Tribal Rabi Paddy

Updated On : January 30, 2024 / 11:14 PM IST

Tribal Rabi Paddy : రబీ వరిసాగులో ఎరువులు, కలుపు యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటంలేదు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలను పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని  పొలంలోనూ అవసరం ఉన్నా,లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

Read Also : Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు తీయవచ్చు : 
నీటి వసతి వున్న ప్రాంతాల్లో రబీ వరిసాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరినాట్లు పూర్తి కావచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్దమవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే  ఎరువుల యాజమాన్యంతో పాటు కలుపు యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పంటకు వేసే పోషకాలను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల సుమారు 40 శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది.

అందువల్ల ప్రతి పంటలోనూ కలుపు నివారణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా  రబీకాలంలో స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు కనుక, వరిపైరులో పిలలుచేసే సమయం తక్కువ వుంటుంది. అందువల్ల పంట దశనుబట్టి  సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ  తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం