Lady’s Finger Cultivation : బెండ సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులు

సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు  చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి8 టన్నుల పశుల ఎరవును వేసి బాగా కలియదున్నాలి.

Lady’s Finger Cultivation : బెండ సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులు

Lady's Finger Cultivation

Lady’s Finger Cultivation : సంవత్సరం పొడవునా  కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్ఠుతం మార్కెట్లో మండిపోతున్న కూరగాయల రేట్లే ఇందుకు ప్రత్యక్ష ఊదాహరణ. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా, స్ధిరమైన ఆదాయన్నిచ్చే పంటగా బెండసాగు రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్థుతం వర్షాలు ఆశాజనకంగా వుండటంతో రైతులు బెండసాగుకు సిద్ధమవుతుండగా ,  నీటివసతి క్రింద ఇప్పటికే విత్తిన బెండ ప్రస్తుతం పూత దశలో వుంది. ముఖ్యంగా ఈ దశలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ కీలకం. మరి బెండలో ఎప్పుడు ఎలాంటి ఎరువులు వేయాలో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Lady Fingers Cultivation : బెండసాగుతో.. రైతులకు లాభాలు అధికం

ఇటీవలి కాలంలో వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగే  రైతుకు లాభదాయకంగా వుంది.ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మర్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 10టన్నుల దిగుబడిని సాధించవచ్చు. బెండలో సూటి రకాలతో పాటు అధిక దిగుబడులిచ్చే పలు సంకరరకాలు అందుబాటులో వున్నాయి.

READ ALSO : Cotton Seeds : ఒకే రకం పత్తి విత్తనాల సాగుకు రైతుల మొగ్గు..

అయితే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు  చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి8 టన్నుల పశుల ఎరవును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాష్ నిచ్చే ఎరువులను కూడా3 ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోల నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3 వంతును 2 బాగాలుగా విత్తిన 30 వ రోజు, 45 వ రోజున వేయాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదు సుమారు 50 శాతం పెంచాలి.

READ ALSO : Ladies Finger : బెండసాగులో యాజమాన్యం, సస్యరక్షణ

బెండ విత్తన రోజుగాని మరుసటి రోజుగాని నేలలో తగినంత తేమ ఉండేట్లు చూసుకొని ఎకరాకు పెండిమిథాలిన్ 30 శాతం 1.2 లీటర్లు పిచికారి చేయాలి. 25, 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు చేయాలి.