Fish Farming : శీతాకాలం చేపల పెంపకంలో మెళకువలు

Fish Farming : సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతీ పంటలోను 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధించవచ్చు. శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Fish Farming : శీతాకాలం చేపల పెంపకంలో మెళకువలు

Fish Farming In Winter Season Telugu

Updated On : December 8, 2024 / 3:32 PM IST

Fish Farming : చలి తీవ్రతతో ఉష్ణోగ్రత పడిపోవడం మనుషులకే కాదు… చేపలకు కూడా ప్రమాదకరమే. శీతాకాలంలో సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి చేపలలో తక్కువగా ఉంటుంది . దీంతో వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతుంటాయి.

ముఖ్యంగా చేపలకు ఈ కాలంలో ఎలాంటి రోగాలు వ్యాపిస్తాయి.. వీటి నుండి చేపలను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఘంటాసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్.

మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గంతలో కంటే అధికంగా పెరిగింది.  రొయ్యలతో పోలిస్తే, చేపల పెంపకంలో ఆదాయం తక్కువ వున్నా, స్థిరమైన రాబడి వుండటం, నష్ట భయం తక్కువ వుండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు. ఈ కల్చర్ కు కూలీల అవసరం తక్కువగా వుండటం వల్ల, రైతుకు రిస్కు తగ్గుతోంది.

సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతీ పంటలోను 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధించవచ్చు. అయితే శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువు నీటి  ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది.

చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధులబారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటాసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్.

చేపల పెంపకానికి, గడ్డుకాలం ఈ శీతాకాలం.  ప్రధానంగా నీరు, మేత యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించినట్లయిచే సమస్యలను అధిగమించి ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.

Read Also : Paddy Fields : వరి మాగాణుల్లో అపరాలు సాగు మెళకువలు